Asianet News TeluguAsianet News Telugu

‘ఓ బేబీ’: ఈ వార్త..పబ్లిసిటీ జిమ్మిక్కా?

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే  ఎలా ఉంటుందనే స్టోరీ లైన్ తో ఈ మూవీ వస్తోంది.

Bollywood interested in Samantha's Oh Baby!
Author
Hyderabad, First Published Jun 4, 2019, 9:22 AM IST

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే  ఎలా ఉంటుందనే స్టోరీ లైన్ తో ఈ మూవీ వస్తోంది. ఈ చిత్రాన్ని  జూలై 5న  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.మ‌జిలీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న స‌మంత ఈ సినిమాతో  మరో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.  అయితే అనుకున్న స్దాయిలో బజ్ అయ్యితే క్రియేట్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ రైట్స్ కోసం బాలీవుడ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే నిజంగానే బాలీవుడ్ ఈ సినిమా చెయ్యాలనుకుంటోందా లేక వాళ్లని రీచ్ అవ్వటానికి , సినిమాకు బజ్ క్రియేట్ చేయటానికి చేసిన పబ్లిసిటీ జిమ్మిక్కా అనేది ట్రేడ్ లో చర్చగా మారింది. ఈ చిత్రం కొరియన్ మూవీ రీమేక్. ఇండియా రైట్స్ మొత్తం సురేష్ బాబు దగ్గరే ఉన్నాయని తెలుస్తోంది. ఓ బేబి రిలీజ్ లోగానే ఈ రైట్స్ ని హిందీలో ఏదన్నా పెద్ద నిర్మాణ సంస్దకు అమ్ముదామని ఆయన ఆలోచనలో ఉన్నారట. అయితే హిందీలో విద్యాబాలన్ లాంటి హీరోయిన్ తో మన సంస్దే సినిమా చేస్తే బాగుంటుందని ఆయన సన్నిహితులు సలహా ఇస్తున్నారట. మరి సురేష్ బాబు ఏం నిర్ణయం తీసుకుంటారో . 

ఇదిలా ఉంటే మరో ప్రక్క ఈ చిత్రం రీషూట్స్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఇవి సమంత చెవిన కూడా పడటం..ఈ మ్యాటర్ ఎలా బయిటకు వచ్చిందని డిస్కస్ చేయటం జరుగుతోందిట. సురేష్ బాబు తన సిబ్బందిలో ఎవరైనా ఈ మ్యాటర్ బయిటకు లీక్ చేసారా అని కోప్పడ్డారా అన్నట్లు  వార్తలు వస్తున్నాయి. అయితే రీషూట్స్ చేయటం పెద్ద వింతేమీ కాదు. తప్పుడు పనేమీ కాదు. ఓ మంచి ప్రాజెక్టు కోసం చేసే ప్రయత్నాల్లో అది ఒకటి. రీషూట్స్ చేసిన చాలా సినిమాలు పెద్ద హిట్టైన చరిత్ర ఉంది. 

 ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించనుండగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ . 

Follow Us:
Download App:
  • android
  • ios