Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పిల్లలకు కాస్ట్లీ బహుమతులు పంపిన ఆలియా భట్, తారక్ ఏమన్నాడంటే..?

హీరో హీరోయిన్ల మధ్య అనుబంధం ఒక్కోక్క సారి ఒక్క సినిమాతోనే గొప్పగా పెరుగుతుంది. అదిఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కు దారి తీస్తుంది. అలాంటి బంధమే కొనసాగుతుంది ఎన్టీఆర్‌, ఆలియా భట్ మధ్య. రీసెంట్ గా తారక్ తనయులకు కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా పంపించిదట ఆలియా. 

Bollywood Heroine Alia Bhatt Sent Costly  Gifts For Ntr Kids
Author
First Published Mar 26, 2023, 9:48 AM IST

హీరో, హీరోయిన్ల మధ్య ఒక్కోసారి ఓక్క సినిమాతోనే మంచి అనుబంధం ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాలలో పదుల సినిమాలు చేసినా కూడా.. కొంతమందితో పరిచయమే ఘనం అనిపిస్తుంది. పెద్దగా మాటలు కూడా ఉండవు. కొంత మంది మాత్రంఒక్క సినిమాకే కుటుంబంలా కలిసిపోతారు.హీరోల మధ్యే కాదు.హీరోయిన్లతో కూడా తెలియని బాండింగ్ ఏర్పడుతుంది. అది సినిమా అయిపోయిన తరువాత కూడా కంటీన్యూ అవుతుంటుంది.కుటుంబంతో కూడా కలిసిపోతుంటారు. ఇక ఫ్యామిలీ అని అనుకున్నాక పండగలు, ఫంక్షన్లు.. పిలుపులు, బహుమతులు కామన్ కదా..? సరిగ్గా ఇదే బంధం ఎన్టీఆర్, ఆలియా మధ్య కూడా కొనసాగుతోంది. తాజాగా అలియా భట్ ఎన్టీఆర్ ఇంటికి బహుమతులు కూడా పంపించింది. 

అయితే ఇక్కడ విచిత్రం ఏంటీ అంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో  రామ్ చరణ్ జోడీగా సీత పాత్రలో నటించింది ఆలియా భట్. కాని ఆమె ఎన్టీఆర్ కు మంచి స్నేహితురాలిగా మారిపోయింది.  అప్పటి నుంచీ తారక్ తో మంచి రిలేషన్ కొనసాగిస్తూ.. ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయింది. ఇక ఆలియా భట్ మంచి నటి మాత్రమే కాదు..మంచి బిజినెస్ ఉమెన్ గా కూడా. రెండేళ్ల క్రితం ఆలియా భట్ కాన్షియస్ క్లాతింగ్ పేరుతో గార్మెంట్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తోంది బ్యూటీ. అయితే అప్పడప్పుడు తన స్నేహితులైన నటీనటులకు మంచి డ్రస్ లు గిఫ్ట్ లుగా పంపించడం ఆలియాకు అలవాటు. 

ఇక తాజాగా ఆలియా భట్  ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు మంచిబమంచి డ్రస్ లు గిఫ్ట్ గా పంపించింది బాలీవుడ్ బ్యూటీ. అంతే కాదు యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్ కు ట్యాగ్ లు పెట్టి పంపించింది. దాంతో తారక్  తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఈ డ్రస్ లు చూసి చాలా సంతోషించారు. ఏన్టీఆర్ ఈ విషయంలో అఫీషియల్ గా స్పందించారు కూడా. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అలియా భట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కృతజ్ఞతలు అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని ఉంచుతుంది. తన పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా అంటూ స్టోరీ షేర్ చేశారు. 

అటు ఎన్టీఆర్ పోస్ట్ కు ఆలియ భట్ కూడా రిప్లే ఇచ్చింది.  నీకు మాత్రం ఈద్ స్పెషల్ గా డ్రస్ లు రెడీ చేస్తానని.. చెపుతూ.. నువ్వు  స్వీటెస్ట్ పర్సన్ వి అని .. థాంక్యూ చెప్పింది బాలీవుడ్ హీరోయిన్. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ల పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక వీరిద్దరునటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ సాధించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయ్యింది. 

ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న ఆలియా భట్.. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న అలియా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్ళికి ముందే తనకు పుట్టబోయే పిల్లల కోసం ఆలోచించి.. 2021లో గార్మెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది బ్యూటీ. ఇక ఆలియా భట్ తన పాప కోసం రెండేళ్ళు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించింది. రణ్ బీర్ కూడా తన  పాపకు టైమ్ కేటాయించడం కోసం ఆరు నెలలు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios