Asianet News TeluguAsianet News Telugu

48 లోను 8 ప్యాక్... హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని హ‌ృతిక్ రోషన్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

ఏజ్ పెరుగుతున్న హ్యాండ్సమ్ అండ్ ఫిట్ నెస్ విషయంలో.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. 
 

Bollywood Hero Hrithik Roshan 8 pack at 48 Years
Author
First Published Jan 3, 2023, 1:28 PM IST

హైటు, వెయిట్, గ్లామర్ , ఫిట్ నెస్.. హ్యాండ్సమ్ బాడీ.. ఈ విషయాలలో ఎంత మంద యంగ్ స్టార్స్ పోటీపడుతున్నా.. బాలీవుడ్ సీనియర్ హీరో హృతిక్ రోషన్ ముందు మాత్రం అంతా తేలిపోతున్నారు. 50 ఏళ్ళకు రెండు అడుగుల దూరంలో ఉన్న హృతిక్ హాలీవుడ్ హీరోలను మించిన బాడీతో.. హ్యాండ్సమ్ హంక్ గా కంటిన్యూ అవుతున్నాడు. ముందునుంచే కండల హీరోగా హృతిక్ కు బాలీవుడ్ లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అది అలాగే కంటీన్యూ చేస్తున్నాడు స్టార్ హీరో. అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడిగా తన స్థానం అలాగేనిలుపుకుంటున్నాడు. 

ఇక రీసెంట్ గా హృతిక్ న్యూ ఇయర్ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.  వయసుతో సంబంధం లేకుండా ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తూ...  ఫిట్ బాడీ కలిగిన హృతికి ఈ వయస్సులో కూడా 8 ప్యాక్ తో సందడి చేస్తున్నాడు. మంచి హైట్,ఫిజిక్ తోఆకట్టుకుంటారాయన. తాజాగా ఆయన 8 ప్యాక్ బాడీ లేడీ ఫ్యాన్స్ కు మతిపోయేలా ట్రీట్ ఇచ్చాడు. జిమ్ లో చొక్కా పైకెత్తి తన 8 ప్యాక్ బాడీని చూపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 

 

48 ఏళ్ల వయసులో హృతిక్ ఇంత  హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటే... అతక్కడ ఆయన పడిన కష్టం  8 ప్యాక్ బాడీ రూపంలో కనిపిస్తోంది. ఫిట్ గా ఉండటానికి హృతిక్ పడే తపన తలుస్తోంది. ఇక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అటు ఆడియన్స్.. అభిమానులతో పాటుగా  బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తుషాన్నారు.రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

ఆల్ రైట్ ిక ముందుకు వెళ్ధాం అంటూ హృతిక్ పెట్టిన పోస్ట్ కు.. ఫోటోలకు కామెంట్స్ పెడుతూ.. సర్.. నాకు రెండు ఆబ్స్ ఇవ్వండి.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.  మరొకరు కామెంట్ చేస్తూ.. సోమవారం నుంచి నా డైట్ మారుతుంది అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘మళ్లీ పాత హృతిక్ తిరిగి వచ్చాడు.. నా చిన్నప్పడి నుంచీ ఇలానే ఉన్నారు మీరు అంటూ..  మరొకరు పాజిటీవ్ కామెంట్లు చేస్తూ.. హృతిక్ ను పొడగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు ఈ వ్యక్తికి 48 సంవత్సరాలు అంటే మీరు నమ్మగలరా అని మరోకరు వ్యాఖ్యానించారు. 

ఇక రీసెంట్ గా విక్రమ్ వేద సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు హృతిక్. తమిళ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం  దీపికా పదుకొణేతో కలిసి ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు హృతిక్. ఈమూవీ 2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios