బాలీవుడ్ లో వంద కోట్లు కలెక్షన్స్ పెద్ద రికార్డు కాదు. కానీ ఒక టాలీవుడ్ హీరో డబ్బింగ్ మూవీతో అందుకోవడం అసలు విషయం. పుష్ప మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఒక విధంగా వాళ్ళు ఇది నొచ్చుకునే విషయమే.

పుష్ప (Pushpa)విజయం ఊహించినదే. అయితే హిందీలో మాత్రం అనూహ్యం. మొదట్లో బాలీవుడ్ లో పుష్ప నెట్టుకు రావడం కష్టమే అన్నమాట వినిపించింది. ఇక పుష్ప చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసిన వారు డిజాస్టర్ అవుతుందని అంచనా వేశారు. సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో పుష్ప మూవీకి అనుకున్నంతగా బుకింగ్స్ నడవలేదు. పుష్ప ఓపెనింగ్ డే నాడు కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ నేపథ్యంలో వంద కోట్ల వసూళ్లు ఎవరూ ఊహించలేదు. 

రోజురోజుకూ ఆదరణ దక్కించుకుంటూ పుష్ప వంద కోట్ల మార్కు చేరుకుంది. పుష్ప కలెక్షన్స్ స్థిరంగా కొనసాగాయి. పుష్ప విజయం బాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తుంది. అక్కడ టాప్ స్టార్స్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. బాలీవుడ్ లో వంద కోట్ల హీరోలు మాత్రం కొందరే. సల్మాన్, అక్షయ్, అమీర్, హ్రితిక్ రోషన్ లను మినహాయిస్తే వంద కోట్ల కలెక్షన్స్ మిగతా హీరోలకు సాధ్యం కాని విషయం. 

ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన పుష్ప మాత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. బాలీవుడ్ లో వంద కోట్లు కలెక్షన్స్ పెద్ద రికార్డు కాదు. కానీ ఒక టాలీవుడ్ హీరో డబ్బింగ్ మూవీతో అందుకోవడం అసలు విషయం. పుష్ప మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఒక విధంగా వాళ్ళు ఇది నొచ్చుకునే విషయమే. 

కాగా సందు దొరికితే బాలీవుడ్ స్టార్స్ ని ఏకిపారేసే వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అల్లు అర్జున్(Allu Arjun) ని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్స్ పై సెటైర్ వేశారు. దాదాపు పుష్ప వంద కోట్ల వసూళ్లు సాధించింది అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు. ఇది బాలీవుడ్ హీరోలకు ఒక చంప పెట్టు అంటూ ట్వీట్ చేశారు. 

సాధారణంగా కమల్ ఆర్ ఖాన్ (KRK) సౌత్ చిత్రాలను చిన్నచూపు చూస్తారు. ఆయన బాహుబలి చిత్రంపై కూడా విమర్శలు చేశారు. అదో చిన్న పిల్లల చిత్రం అంటూ కామెంట్ చేశారు. అలాంటిది అల్లు అర్జున్ తో పాటు పుష్ప చిత్రాన్ని ప్రసంశించడం విశేషంగా మారింది. ప్రభాస్ తర్వాత బాలీవుడ్ లో అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చకున్నట్లు అయ్యింది. 

Scroll to load tweet…

పుష్ప భారీ విజయం సాధించిన నేపథ్యంలో సెకండ్ పార్టీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక పుష్ప పార్ట్ 2 మరింత గ్రాండ్ గా దర్శకుడు సుకుమార్ సిద్ధం చేయనున్నారు. త్వరలో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 చివర్లో లేదా 2023 ప్రారంభంలో పుష్ప విడుదల కానుంది. పుష్ప మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా... దేవిశ్రీ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించారు.