దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ నియోజకవర్గాల్లోఈరోజు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరగనుంది.

కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు బాలీవుడ్ సెలబ్రెటీలు తమ ఓటుహక్కుని వినియోగించుకోలేకపోయారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని ఇంటర్వ్యూ చేసిన సినీ నటుడు అక్షయ్ కుమార్ ఓటు వేయలేకపోయారు. ఎన్నికల్లో ఓటు వేయాలని మోదీ ట్యాగ్ చేసిన సెలబ్రిటీలలో అక్షయ్ కూడా ఒకరు.

కానీ ఆయనకి మాత్రం ఓటేసే ఛాన్స్ రాలేదు. అక్షయ్ పంజాబ్ లో పుట్టినప్పటికీ అతడుకి కెనడియన్ పాస్ట్ పోర్ట్ ఉంది. దాంతో ఆయన ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు. నటి అలియాభట్ కూడా ఓటేయలేకపోయింది. ఈ విషయాన్ని ఆమె కొద్దిరోజుల క్రితం స్వయంగా వెల్లడించింది.

దానికి కారణం ఆమె బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. నటి దీపిక పదుకోన్ పుట్టింది డెన్మార్క్ లోని కొపెన్ హాగెన్ లో.. ఆమెకి డ్యానిష్ పాస్ పోర్ట్ ఉండడం వలన ఓటేయలేకపోయారు. నటి కత్రినా కైఫ్ కి యూకే పాస్ పోర్ట్ ఉండడంతో ఆమెకి ఎన్నికల్లో ఓటేసే అవకాశం లేకుండా పోయింది.