Asianet News TeluguAsianet News Telugu

#Balakrishna బాలయ్యకి విలన్‌గా బాబీ డియోల్ , షాకింగ్ రెమ్యునరేషన్

బాలయ్య సినిమాకు బాబీడయోల్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. బాలయ్య యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంలో బాబీడయోల్ రూత్ లెస్ విలన్ గా కనిపించనున్నారు. 

Bobby Deol Shocking Remuneration For Balayya film Tollywood jsp
Author
First Published Feb 1, 2024, 8:07 AM IST

ఒక్క హిట్  చాలు ఓ నటుడు జీవితాన్ని మలుపు తిప్పటానికి. అదే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ కు మారుతోంది. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాల పాటే కనిపించిన బాబీ, తన విలనిజంతో  ఓ రేంజిలో  షేక్ చేశారు. అప్పటిదాకా ఉన్న ఆయన ఇమేజ్‌నే ఈ సినిమా మార్చేసింది. దీంతో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ సీనియర్ స్టార్‌. ముఖ్యంగా బాబీడయోల్  డేట్స్‌ కోసం సౌత్ మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెమ్యునరేషన్ సైతం అదే స్దాయిలో పెంచేసారని సమాచారం.  

ఇక బాలయ్య ప్రస్తుతం తన 109వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా NBK 109 నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్‌ను రంగంలోకి దించారు. ఫిల్మ్ నగర్  వర్గాల నుంచి అందుతున్న ఇన్ఫోని బట్టి బాలయ్య సినిమాకు బాబీడయోల్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. బాలయ్య యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంలో బాబీడయోల్ రూత్ లెస్ విలన్ గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఎనిమిది కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారట. ఆయనకు ఉన్న క్రేజ్, పోటీని బట్టి ఈ రేటు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, నవాజుద్దీన్ సిద్దిఖి ...తెలుగులో ఫ్యాన్సీ రెమ్యునరేషన తో సినిమా లు చేసారు..చేస్తున్నారు. ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ బాలీవుడ్ నటులను తెస్తున్నారు మనవాళ్లు. 

యానిమల్ రిలీజ్‌ కన్నా ముందే హరి హర వీరమల్లులో నటించేందుకు ఓకే చెప్పారు బాబీ డియోల్‌, కానీ ఆ సినిమా బ్రేక్ పడింది. తరువాత బాలయ్య 109వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. మరో ప్రక్క కంగువ సినిమాలో బాబీ డియోల్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. ఫస్ట్‌ లుక్‌తోనే అబ్రార్‌ క్యారెక్టర్‌ను మించి క్రుయాలిటీ చూపించబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు.  చిరు విశ్వంభర సినిమాలోనూ బాబీ డియోల్‌ను విలన్‌గా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. అయితే ఆల్రెడీ రెండేళ్ల వరకు బాబీ డేట్స్ బిజీ అవ్వటంతో కాల్షీట్స్‌ అడ్జస్ట్ అవ్వలేదని వేరే స్టార్ ని తీసుకుంటున్నారట.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios