బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఒడిదుడుకులతో సాగుతుంది. నెవర్‌ బిఫోర్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ అని ప్రారంభంలో నాగార్జున చెప్పారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ సీజన్‌ సాగలేకపోతుంది. చాలా వరకు బోరింగ్‌గా సాగుతుందని, వారాంతాల్లో తప్ప మిగిలిన డేస్ లో అదొక బోరింగ్‌ ఎపిసోడ్‌లా మారిందనే కామెంట్స్ నెటిజన్లు, టీవీ ఆడియెన్స్ నుంచి వినిపిస్తుంది. ఇటీవల కుమార్‌ సాయిని ఎలిమినేట్‌ చేసినప్పుడు కూడా అలాంటి కామెంట్సే వచ్చాయి. అసలు బిబి చూడమని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా హోస్ట్ మారుతున్నట్టు తెలుస్తుంది. నాగార్జున స్థానంలో మరో హోస్ట్ రాబోతున్నారని అంటున్నారు. బిగ్‌బాస్‌4 వ్యాఖ్యాతగా నాగ్‌ కోడలు, హీరోయిన్‌ సమంత చేయబోతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో సాగుతుంది. 

నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన మనాలీకి వెళ్ళనున్నారట. అక్కడ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఈ వారం  ఆయన స్థానంలో హోస్ట్ గా సమంత పాల్గొంటారనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ షో ప్రారంభంలో హోస్ట్ గా సమంత పేరు వినిపించిన విషయం తెలిసిందే. మరి ఇదే నిజమైతే, ఈ రూపంలో సమంత హోస్ట్ గా కనిపిస్తారని చెప్పొచ్చు. 

మరోవైపు రోజా పేరు కూడా బాగా వినిపిస్తుంది. మరి వీరిద్దరిలో ఎవరు ఈ సారి హోస్ట్ గా కనిపిస్తారనేది సస్పెన్స్ గా మారింది. గత సీజన్‌లో ఓ వారం హోస్ట్ గా రమ్యకృష్ణ వచ్చిన విషయం తెలిసిందే.