బిగ్‌బాస్‌4 పాపులర్‌ కంటెస్టెంట్‌ సోహైల్‌ కి ఇప్పుడు బయట విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇంతటి క్రేజ్‌ని అతను కూడా ఊహించి ఉండడు. హౌజ్‌లో చివరి రోజుల్లో ఆయన చేసిన హంగామే కారణం. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు ఆయన్ని సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే సోహైల్‌ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. శ్రీనివాస్‌ వింజనంపాటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తుండగా, `జార్జిరెడ్డి` ఫేమ్‌ అప్పిరెడ్డి తన మైక్‌ మూవీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. నిజార్‌ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభమైంది. బుధవారం చిత్ర షూటింగ్‌ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. సోహైల్‌ సైతం తన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన సినిమా షూటింగ్‌ ప్రారంభమవడంతో సోహైల్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని, ఆడియెన్స్, ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు రానటువంటి కొత్త కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించనున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.