Asianet News TeluguAsianet News Telugu

ఫినాలేకి చేరుకున్న సామ్రాట్.. డేంజర్ లో రోల్

దీంతో.. సామ్రాట్ ఈ వారం నామినేషన్ బాధ నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లిపోయాడు. 

bigg boss2.. samrat is the first candidate of finalists
Author
Hyderabad, First Published Sep 21, 2018, 10:53 AM IST

బిగ్ బాస్ 2 తెలుగు రియాల్టీ షో.. ముగింపు దశకు చేరుకుంది. చివరి దశకు చేరుకునే సరికి షో మరింత ఆసక్తిగా మారింది. మూడు రోజులుగా హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్‌ ఎపిసోడ్ 103లో కాస్త చ‌ల్ల‌బ‌డిన‌ట్టు క‌నిపించింది. బిగ్ బాస్ ఫినాలే రేస్ టుకి చేరుకునేందుకు సామ్రాట్‌, రోల్ రైడాల‌కి మీ గుడ్డు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . ఈ టాస్క్‌లో బిగ్ బాస్ ఆ ఇద్ద‌రి కంటెస్టెంట్స్‌కి బౌల్ లో కోడిగుడ్లు ఇచ్చారు. బౌల్‌లో ఉన్న కోడిగుడ్ల‌ని గేమ్‌లో పాల్గొన్న‌ ఇద్ద‌రు స‌భ్యులు ప‌గ‌ల‌గొట్ట‌కుండా చూసుకోవాలి. టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటి స‌భ్యులు ఒక‌రికి మ‌ద్ద‌తు తెలుపుతూ మ‌రొక‌రివి ప‌గ‌ల‌గొట్టొచ్చ‌ని అన్నారు. చివరిగా ఎవరి బౌల్‌లో ఎక్కువ గుడ్లు పగలకుండా ఉంటాయో వాళ్లే డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్తారంటూ బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు .

దీంట్లో రోల్ కి కౌశల్ మద్దతుగా నిలవగా.. సామ్రాట్ కి తనిష్, దీప్తి, గీతాలు మద్దతుగా నిలిచారు. చివరకు రోల్ గుడ్లు పగిలిపోవడంతో.. సామ్రాట్ ఫినాలేకి చేరుకున్నారు.  దీంతో.. సామ్రాట్ ఈ వారం నామినేషన్ బాధ నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లిపోయాడు. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఈ వారం నామినేషన్ లలో ఇంటిసభ్యులంతా ఉన్న సంగతి తెలిసిందే.

వీరిలో రోల్, సామ్రాట్ లకు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు సామ్రాట్ ఫినాలేకి వెళ్లిపోవడంతో.. ఆ ఎఫెక్ట్ రోల్ మీద పడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ వారం రోల్ ఎలిమినేట్ అయితే ఫైనల్స్ లో కౌశల్, తనిష్, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios