Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: రోల్ ఔట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు నాని. నిమర్జనం సంధర్భంగా నాని మెడలో డోలు వేసుకొని తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. 

bigg boss2: roll rida eliminated from house
Author
Hyderabad, First Published Sep 23, 2018, 10:35 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు నాని. నిమర్జనం సంధర్భంగా నాని మెడలో డోలు వేసుకొని తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. నాని నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, రష్మిక, ఆకాంక్ష సింగ్ లు షోకి వచ్చారు. హౌస్ మేట్స్ కి 'దేవదాస్' సినిమా ట్రైలర్ వేసి చూపించారు నాగార్జున.

ఆ తరువాత నాని హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ సొంతంగా క్యాంపైనింగ్ చేసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఆడియన్స్ తమకు ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు..? మిగిలిన హౌస్ మేట్స్ కి ఎందుకు వేయకూడదనే విషయాలను చర్చించాలి. ఇందులో భాగంగా కౌశల్ హౌస్ లో తన ప్రయాణాన్ని ఓ కథతో పోలుస్తూ చెప్పారు. మిగిలిన హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపారు.

అయితే మిగిలిన హౌస్ మేట్స్ దీప్తి, గీతామాధురి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా తమకు ఎందుకు ఓట్లు వేయాలో చెబుతూనే మిగిలిన హౌస్ మేట్స్ కూడా తమకు ముఖ్యమేనంటూ నచ్చిన వారికి ఓట్లు వేయాలని సూచించారు. ఇక హౌస్ మేట్స్ లో ఎవరు ఫినాలేకి వెళ్లబోతున్నారనే విషయాన్ని వెల్లడిస్తూ ముందుగా కౌశల్ పేరు చెప్పారు హోస్ట్ నాని.

ఆ తరువాత గీతామాధురి, తనీష్ ల పేర్లు చెప్పి దీప్తి, రోల్ రైడా పేర్లలో ఒకరి పేరు చెప్పడంలో నాని కొంచెం సస్పెన్స్ మైంటైన్ చేస్తూ.. దీప్తి పేరు చెప్పి.. రోల్ ఎలిమినేట్ అయిన విషయాన్ని వెల్లడించారు. సామ్రాట్ ముందే ఫినాలేకి వెళ్లడంతో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు ఫినాలేకి చేరుకున్నారు. ఇక వెళ్తూ వెళ్తూ రోల్ టాప్ త్రీలో కౌశల్, తనీష్, గీతామాధురిలు ఉంటారని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios