Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: గీతా-సామ్రాట్ ల మధ్య ఏం జరుగుతోంది..?

బిగ్ బాస్ సీజన్ 2 లో తొలుత తేజస్వితో ప్రేమాయణం సాగించాడు సామ్రాట్. హౌస్ లో వీరిద్దరూ కలిసి ఉండడం, ఒకరినొకరు ప్రేమగా హగ్ చేసుకోవడం వంటి విషయాలు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుమానాలను రేకెత్తించాయి

bigg boss2: new relationship between geethamadhuri and samrat
Author
Hyderabad, First Published Aug 17, 2018, 12:34 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 లో తొలుత తేజస్వితో ప్రేమాయణం సాగించాడు సామ్రాట్. హౌస్ లో వీరిద్దరూ కలిసి ఉండడం, ఒకరినొకరు ప్రేమగా హగ్ చేసుకోవడం వంటి విషయాలు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుమానాలను రేకెత్తించాయి. అయితే తమ మధ్య ఏంలేదని స్నేహితులం మాత్రమేనంటూ బయటకి వచ్చిన తేజస్వి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు హౌస్ లో గీతామాధురి, సామ్రాట్ ల మధ్య ఏదో జరుగుతుందనే రూమర్లు మొదలయ్యాయి.

దానికి కారణం గత రెండు, మూడు రోజులుగా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. రోజురోజుకి ఆ క్లోజ్ నెస్ కాస్త పెరుగుతూ వస్తోంది. మొన్నటి ఎపిసోడ్ లో గీతా-సామ్రాట్ ల మధ్య చూపుల యుద్ధం జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈయన నాకు బాగా క్లోజ్ అయిపోతున్నారు అంటూ శ్యామలకి చెబుతూ సామ్రాట్ చేతిని పట్టుకొని కూర్చుంది గీత.

ఇక సరదాగా ఆడుకుంటూ నా ఫ్రెండ్స్ కొందరికి ఇలా హగ్ ఇస్తాను అంటూ సామ్రాట్ పై తన లిప్ స్టిక్ ని పూసింది. దీప్తి సునైనా లిప్ స్టిక్ రాస్తే రాయించుకుంటారు.. నేను రాస్తే మాత్రం తప్పించుకుంటారా ఏంటి ఈ ఫేవరిటిజం అంటూ సామ్రాట్ షర్ట్ కి లిప్ స్టిక్ పూసింది. దీంతో సామ్రాట్, గీతాని పట్టుకొని ఆమె లిప్ స్టిక్ మొత్తాన్ని చేతితో తుడిచేశాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios