Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: కౌశల్ కి నాని క్లాస్.. గీతా, శ్యామల సేఫ్

బిగ్ బాస్ సీజన్ 2 పదోవారం పూర్తి కానుంది. శనివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశాడు నాని. హౌస్ మేట్స్ లో పురుషులకు ఫెయిర్ అండ్ హాండ్సమ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫెయిస్ అండ్ హాండ్సమ్ వారు ఇచ్చిన లక్ష రూపాయల నగదు బహుమతి పొందాడు సామ్రాట్.

bigg boss2: nani targeting kaushal
Author
Hyderabad, First Published Aug 18, 2018, 11:08 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 పదోవారం పూర్తి కానుంది. శనివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశాడు నాని. హౌస్ మేట్స్ లో పురుషులకు ఫెయిర్ అండ్ హాండ్సమ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫెయిస్ అండ్ హాండ్సమ్ వారు ఇచ్చిన లక్ష రూపాయల నగదు బహుమతి పొందాడు సామ్రాట్. టాస్క్ అనంతరం నాని హౌస్ మేట్స్ ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వేసి ఆడియన్స్ ని బాగా నవ్వించాడు.

ఒక్కొక్కరితో మాట్లాడుతూ కౌశల్ టర్న్ వచ్చేసరికి అతడికి చిన్నపాటి క్లాస్ తీసుకున్నాడనే చెప్పాలి. ప్రతిసారి ఒంటరిగా పోరాడుతున్నాను, హౌస్ మేట్స్ సపోర్ట్ లేదని చెప్పే కౌశల్ ని నాని ప్రశ్నించాడు. కాల్ సెంటర్ టాస్క్ లో కౌశల్ కి మిగిలిన హౌస్ మేట్స్ ఇచ్చిన సపోర్ట్ ని గుర్తు చేశారు. 'నీకు ఎంతగా హౌస్ మేట్స్ తో కలవాలని ఉన్నా... ఎందుకో కావాలనే కలవడం లేదనిపిస్తుంది. ఎందుకు ఆ చిన్న లైన్ క్రాస్ అవ్వడం లేదని' నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా..

'మాట్లాడితే అభిప్రాయబేధాలు వస్తున్నాయి. నేను ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఎవరికీ నచ్చదు. అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే బెటర్ అనిపిస్తుందని' కౌశల్ అన్నాడు. 'మొదట్లో నిన్ను సపోర్ట్ చేసిన గీతా, బాబు, గీతలు ఇప్పుడు నీతో గొడవ పడుతున్నారంటే తేడా ఎక్కడ ఉందో కనిపించడం లేదా?. నీ ఆలోచనలు బాగున్నాయ్. కాని ప్రజెంట్ చేసే విధానం బాగోలేదంటూ' హితవు పలికారు నాని.

అనంతరం నాని చెప్పిన మాటలకు కన్విన్స్ అవుతూ అందరితో స్నేహంగా ఉంటానని చెప్పాడు కౌశల్. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన రోల్ రైడా, పూజా రామచంద్రన్, శ్యామల, దీప్తి సునైనా, గీతామాధురిలలో శ్యామల, గీతా సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాని ప్రకటించారు. రోల్, పూజా, సునైనాలలో ఎవరు హౌస్ నుండి వెళ్లబోతున్నారనే రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది. కానీ వీరి ముగ్గురిలో సునైనాకి ఓట్లు తక్కువగా పడ్డాయని ఆమె హౌస్ నుండి వెళ్లడం ఖాయమని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios