బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ హౌస్ నుండి బయటకి వెళ్లినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ హౌస్ నుండి బయటకి వెళ్లినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ సీజన్ 2 లో ఉన్న హౌస్ మేట్స్ అందరిలో కంటే కౌశల్ కి అభిమానగణం బాగా పెరిగిందనే చెప్పాలి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మొదటి నుండి హౌస్ మేట్స్ అతడిని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అతడికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఎంతగా అంటే అతడి కోసం సోషల్ మీడియాలో ఆర్మీలు తయారవ్వడం, అతడి కోసం 2కె రన్ లు చేయడం వరకు వెళ్లింది. కౌశల్ విన్నర్ అవ్వాలని అతడిఅభిమానులు కోరుకుంటుంటే సడెన్ గా కౌశల్ ని ఇంటి నుండి బయటకి పంపేశారట.

అతడు బయటకి వెళ్లడం కలకలం రేపుతోంది. కౌశల్ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందంటే దానికి కారణం ఓ అభిమాని అని తెలుస్తోంది. ఇప్పటివరకు హౌస్ లో మిస్టర్ పెర్ఫెక్ట్ గా ఉంటోన్న కౌశల్ ని కావాలని టార్గెట్ చేసి బ్యాడ్ ఇమేజ్ తీసుకొస్తున్నారనేది కొందరి ఆరోపణలు. ఓ అభిమానైతే ఏకముగా తిండి మానేసి ఆరోగ్యం పాడుచేసుకున్నాడట. దీంతో అతడు ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యాడు.

సదరు అభిమాని తల్లితండ్రులు ఈ విషయాన్ని బిగ్ బాస్ దృష్టికి తీసుకెళ్లగా.. దీంతో అతడిని చూడడానికి బిగ్ బాస్ కౌశల్ ని బయటకి పంపినట్లు టాక్. అయితే ఈ దృశ్యాలను మాత్రం షోలో చూపించే అవకాశాలు లేవని అంటున్నారు. గంట సేపు కౌశల్ ని బయటకు తీసుకెళ్లి మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో నిజానిజాలు తెలియాల్సివున్నాయి!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తో బోయపాటి సినిమా..?

బిగ్ బాస్2: కౌశల్-తనీష్ ల మధ్య వేడి చర్చ.. కౌశల్ కామెంట్స్ తో హౌస్ మేట్స్ షాక్!

బిగ్ బాస్2: డిజాస్టర్ నువ్వు నాని.. కౌశల్ ఆర్మీ ఎటాక్!