Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: కౌశల్ కి ఫైనల్ కి వెళ్లే అర్హత లేదు.. టార్గెట్ చేసిన హౌస్ మేట్స్!

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే హడావిడి మొదలైపోయింది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకున్నారు. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లలో ఎవరు బిగ్ బాస్ టైల్ గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది.

bigg boss2: Kaushal Again Targeted By Housemates
Author
Hyderabad, First Published Sep 25, 2018, 9:52 AM IST

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే హడావిడి మొదలైపోయింది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకున్నారు. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లలో ఎవరు బిగ్ బాస్ టైల్ గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది.

ఇక సోమవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ మరోసారి కౌశల్ ని టార్గెట్ చేశారు. నిన్నటి టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఫినాలేకి చేరిన ఐదుగురిని ఫైనల్ తో మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు..? ఎవరు ఉండకూడదనుకుంటున్నారు..? అనే విషయాలను తెలియజేస్తూ.. బోర్డుపై ఉంచిన ఫోటోలు ఎదురుగా ఇష్టమైన వ్యక్తి ఎదురుగా హార్ట్ సింబల్ పెట్టాలని, అలానే ఇష్టం లేని వ్యక్తి ఎదురుగా డిస్ లైక్ సింబల్ పెట్టాలని సూచించారు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో కౌశల్ ఫైనల్స్ లో తమతో పాటు ఉండకూడదని భావిస్తున్నట్లు తనీష్, గీతా, దీప్తి, సామ్రాట్ లు అతడికి డిస్ లైక్ కొట్టారు. ఈ నలుగురు రకరకాల కారణాలతో కౌశల్ కి డిస్ లైక్ కొట్టగా.. కౌశల్ టర్న్ వచ్చేసరికి ఆయన తనతో పాటు గీతామాధురి ఫైనల్స్ కి రావొచ్చని, సామ్రాట్ తన దృష్టిలో వీక్ కంటెస్టెంట్ అని అతడి ఫైనల్ లో చూడాలనుకోవడం లేదని అన్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios