Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్: మీరు వెటకారంగా ఎందుకు మాట్లాడారు.. కౌశల్ పై గణేష్ ఫైర్!

బిగ్ బాస్ సీజన్ 2 పదో వారంలోకి వచ్చేసింది. ఇప్పుడు హౌస్ మేట్స్ లో ఎలిమినేషన్ టెన్షన్ మరింత ఎక్కువైందనే చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ లో భాగంగా కాల్ సెంటర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్

bigg boss2: genesh fires on kaushal during task
Author
Hyderabad, First Published Aug 15, 2018, 2:57 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 పదో వారంలోకి వచ్చేసింది. ఇప్పుడు హౌస్ మేట్స్ లో ఎలిమినేషన్ టెన్షన్ మరింత ఎక్కువైందనే చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ లో భాగంగా కాల్ సెంటర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ రెండు టీమ్ లుగా విడిపోవాలి. వారిలో ఒక టీమ్ కాల్ సెంటర్ ఉద్యోగులు కాగా మరొక టీమ్ పబ్లిక్ కాలర్స్.

ఈ టాస్క్ లో కౌశల్, దీప్తి, సామ్రాట్, శ్యామల, అమిత్, నూతన్ నాయుడు కాల్ సెంటర్ ఉద్యోగులుగా ఉండగా, మిగిలిన తనీష్, సునైనా, గీతా మాధురి, పూజా, గణేష్, రోల్ రైడాలు పబ్లిక్ కాలర్స్ గా ఉన్నారు. అయితే ఇందులో భాగంగా కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న కౌశల్ ను పబ్లిక్ కాలర్స్ టీమ్ టార్గెట్ చేసింది. గీతా మాధురి, సునైనా.. కౌశల్ పై తమ మాటలతో విరుచుకుపడ్డారు. అయినప్పటీకే కౌశల్ తన సహనాన్ని కోల్పోకుండా సమాధానాలు ఇచ్చాడు. సునైనా ఇష్టంవచ్చినట్లు కౌశల్ ని తిట్టడంతో అతడు కూడా సునైనాను వ్యక్తిగతంగా దూషించాడు.

ఇక నేటి ఎపిసోడ్ లో గణేష్ కూడా కౌశల్ పై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. కౌశల్ కి ఫోన్ చేసిన గణేష్.. 'నాకు ఇక్కడ మర్యాద దక్కడం లేదు.. మీరు దాన్ని వెటకారంగా హేళన చేస్తూ ఎందుకు మాట్లాడారు. నేను దానికి హర్ట్ అయ్యాను. మీరు నన్ను ఎందుకు హర్ట్ చేశారు' అంటూ గట్టిగా అరుస్తూ అన్నాడు. మధ్యలో గీతా కుమ్మేస్తున్నాడా..? గణేష్ అంటూ నవ్వుతూ తోటి హౌస్ మేట్స్ తో డిస్కస్ చేసింది. మరి ఈ ఫోన్ సంభాషణలలో ఏ టీమ్ గెలిచిందో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది! 

 

Follow Us:
Download App:
  • android
  • ios