బిగ్ బాస్2: బాబు గోగినేని అవుట్.. రోల్ రైడాపై బిగ్ బాంబ్

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 12, Aug 2018, 11:31 PM IST
bigg boss2: babu gogineni eliminated from house
Highlights

బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి తాజాగా బాబు గోగినేని కూడా చేరారు

బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి తాజాగా బాబు గోగినేని కూడా చేరారు. ఆదివారం హౌస్ నుండి ఆయన ఎలిమినేట్ అయినట్లుగా నాని అనౌన్స్ చేశారు. ఈ వారం మొత్తం ఆరుగురు ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో నిలవగా అందులో గీతామాధురి, శ్యామల సురక్షితులైనట్లు శనివారమే వెల్లడించారు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో తనీష్, గణేశ్ సేవ్ అయినట్లు చెప్పి ఆఖరిలో దీప్తి, బాబు గోగినేనిల గురించి ప్రస్తావిస్తూ.. 'బాబు గారు మీరు సహనా గారిని కలిసి టైమ్ వచ్చేసింది' అని ఎలిమినేషన్ ప్రకటించారు. గత రెండు వారాలుగా ఆయన గీతామాధురి, కౌశల్ తో ప్రవర్తించిన తీరు అలానే ఇటీవల టాస్క్ లలో సరిగ్గా పోటీపడకపోవడం వంటివి ప్రేక్షకులకు కోపం తెప్పించాయి. అలానే కౌశల్ ఆర్మీ కూడా బాబు గోగినేనిని టార్గెట్ చేసిందనే వార్తలు వినిపించాయి.

ఆ కారణంగానే ఆయనకు తక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఇక వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ ని రోల్ రైడాపై విసిరారు. దీని ప్రకారం ఈ వారం మొత్తం అతను సామ్రాట్ పర్యవేక్షణలో హౌస్ లోని టాయిలెట్స్ ను క్లీన్ గా ఉంచాలి. 

loader