06:46 PM (IST) Sep 08

Bigg Boss Telugu Season 9కామనర్స్ ఐదు వారాల్లోనే జంప్‌

బిగ్‌ బాస్‌ షో ఉన్నదే సెలబ్రిటీల కోసం అని, అలాంటిది కామనర్స్ ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు టీవీ నటుడు నరేష్‌ లొల్లా. అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇస్తూ, ఈ సారి బిగ్‌ బాస్‌ కప్‌ ఎవరి సొంతమో కూడా చెప్పేశాడు. 

Read more

04:40 PM (IST) Sep 08

Bigg Boss Telugu Season 9టెనెంట్లకి భోజనం కట్‌ చేసిన బిగ్‌ బాస్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9లో మొదటి రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టెనెంట్లకి చుక్కలు చూపిస్తున్నారు బిగ్‌బాస్‌. ఉన్నట్టుండి ఆహారం కట్‌ చేశారు. హోనర్స్ అనుమతి లేకుండా వారి హౌజ్‌లోకి వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. అదే సమయంలో ఉన్నట్టుండి ఆహారం తీసి స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని తెలిపారు. చాలా మంది భోజనం చేయకుండానే వారికి శిక్ష విధించారు. ఇది ఆసక్తికరంగా మారింది. 

YouTube video player

12:08 PM (IST) Sep 08

Bigg Boss Telugu Season 9Bigg Boss Telugu 9 Promo: ఫస్ట్ డే నుంచే రచ్చ.. మాస్క్ మెన్ హరీష్ వర్సెస్ మర్యాద మనీష్..

Bigg Boss Telugu 9 Promo: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. కానీ ఈసారి తొలిరోజే హౌస్‌లో కలహాలు, గొడవలు మొదలైపోయాయి. సాధారణంగా మొదటి రోజు హౌస్‌లో నవ్వులు, డాన్స్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం సీజన్ ఓపెనింగ్ నుంచే “ఫైర్ గేమ్” మొదలైంది. ఈ సీజన్​కి సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Full Story
06:35 AM (IST) Sep 08

Bigg Boss Telugu Season 9బిగ్ బాస్ హౌస్ లో సెలెబ్రిటీలు

ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వీరిలో 9 మంది సెలెబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కి అవకాశం దక్కింది. ఈ సారి బిగ్ బాస్ షోలో 2 హౌస్ లని తీసుకువచ్చారు. ఈసారి చదరంగం కాదు రణరంగం అనే నినాదంతో బిగ్ బాస్ 9 ప్రారంభం అయింది. బిగ్ బాస్ తెలుగు 9లో ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, సంజన లాంటి సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు.