Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆరోహీ, సూర్యతో హనీమూన్ ట్రిప్ సీక్రేట్, ఫస్ట్ టైమ్ ఏడ్చేసిన శ్రీహాన్.

బిగ్ బాస్ తెలుగు సీజన్6 కాస్త చప్పగా అనిపించినా..  ఆతరువాత సీజన్ పై ఇట్రెస్ట్ పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా దసరా ఉత్సవానికి సండేను జోడించి.. హౌస్ మెట్స్ తో కలిసి రచ్చ రచ్చ చేశాడు కింగ్ నాగార్జున. ఇక ఈ వారం దసరా ఆటలు పాటలతో పాటు ఎలిమినేషన్  గండం కూడా తప్పలేదు కంటెస్టెంట్స్ కు. 

Bigg Boss Telugu Season 6 Arohi Eliminated
Author
First Published Oct 2, 2022, 11:24 PM IST

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం  ఎలిమినేట్ అయ్యింది ఆరోహీ.  చాలా ఉత్కంట భరితంగా సాగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఆరోహీ బయటకి రాక తప్పలేదు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఇంటి సభ్యులు. మొదటి నుంచి దసరా సెలబ్రేషన్స్ లో పాటు  ఓక్కకరిని సేఫ్ చేస్తూ.. వచ్చాడు నాగార్జున. ఇక చివరిగా సుదీపతో పాటు ఆరోహి మిగిలి ఉండగా.. ఇద్దరిలో ఆరోహీకి ఓటింగ్ తక్కువగా రావడంతో   ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. 

ఆరోహీ స్టేజ్ మీదకు రావడంతోనే .. కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అయ్యింది. ఇక వెళ్ళిపోబోయే ముందు హౌస్ మెంట్స్ గురించి మాట్లాడింది ఆరోహీ. తాను ఎవరికి అన్నం తినిపించింది లేదని.. శ్రీహాన్ ఒక్కడికి  తిని పించాను అంత మంచివాడిని చూడలేదంటూ శ్రీహాన్ చేత ఫస్ట్ టైమ్ కంటతడి పెట్టించింది. ఇక కీర్తి తనకు ఇంట్లో ఎంతో ఇష్టమైనవ్యాక్తి అంది. ఆమె ఇంత వరక ఎవరిగురించి చెడుగా చెప్పింది లేదు అంటూ.. కీర్తి క్యారెక్టర్ ను పోగిడేసింది. అంతే కాదు అందరూ కీర్తిని బాగా చూసుకోవాలి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింద ఆరోహీ.

ఇక సూర్య ఆరోహీ వెళ్తున్న బాధలో మాట్లాడలేకపోయాడు. జాగ్రత్త చెపుతూ.. టికెట్స్ బుక్ చేయమన్నాడు. దాంతో అందరూ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడంతో.. ఆరోహీ సంచలన వ్యాఖ్యలు చేసింది టికెట్స్ అంటే మన హనీమూన్ టికెట్స్ అనుకుంటారు వీళ్లంతా.. సార్ కూడా తేడాగా చూస్తున్నారు అంటూ.. క్లారిటీ ఇచ్చింది ఆరోహీ.. తాము అంతా కేరళ వెళ్దాం అని అనుకున్నామని. ఆ టికెట్స్ గురించే మాట్లాడుతున్నామంటూ అందరికి క్లారిటీ ఇచ్చింది.  దాదపు అందరి గురించి పాజిటీవ్ గానే మాట్లాడింది ఆరోహీ. ఇక తనకు మంచి ఫ్యామీలీ దొరికిందని... బయటికి వచ్చాక అందరం కలవాలంటూ ఆశించింది. 

కొంత మందిని  పొగుడుతూనే వారికి చురకలంటించింది ఆరోహీ. రేవంత మంచివాడని.. ఆట తీరు బాగుంటుందని.. కాని ఆవేశం తగ్గించుకుని.. తొందరపడకుండా ఆడాలంది. ఇక బాల ఆధిత్యను ఆట ఆడండి అన్నా.. మరీ అంత మంచితనం పనికి రాదు అంటూ.. ముఖం మీదే చెప్పేసింది. అంతకు ముందు స్టేజ్ పై రకరకాలా ఈవెంట్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు స్టార్. స్టార్ సింగర్స్ తో పాటు శ్రద్దా దాస్ లాంటి హాట్ బాంబ్స్ స్టేజ్ పై డాన్స్ లతో దడదడలాడించారు. పాటలు ఆటలతో దసరా ఉత్సవం అద్భుతంగా జరిగింది. 

ఈ ఈవెంట్ లో తన ఘోస్ట్ మూవీని ప్రమోట్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా ట్రైలర్ ను హౌస్ మెంట్స్ కు చూపించారు. హౌస్ అంతా ఆల్ ది బెస్ట్ చెప్పగా.. నాగ్ కాసేపు సోనాల్ ను. ప్రవీన్ ను సెటైర్లతో ఆడేసుకున్నాడు. సినిమా రిలీజ్ కోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్నానంటూ ప్రవీణ్ సత్తారు చెపుతూ.. లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నాను అన్నాడు. ఇక నాగ్ లీడ్ తీసుకుని లీక్విడ్స్ అంటే అవేనా అంటూ సెటైర్ వేశాడు. ఇక సోనాల్ వచ్చి రావడంతోనే నాగార్జునను ఆకాశానికెత్తుతూ తెగ పొగిడేసింది. సినిమాలోనే కాదు బయట కూడా నాగ్ సార్ బెస్ట్ అన్నది. అంతే కాదు మీరు బెస్ట్ హోస్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది సోనాల్. 

Follow Us:
Download App:
  • android
  • ios