Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేటైయ్యేది ఎవరో తెలిసిపోయింది


బిగ్ బస్ సీజన్ 4 సగం పూర్తి అయ్యింది. ఇదే విషయం ఇంటి సభ్యులు గుర్తు చేసిన బిగ్ బాస్ మరింత హీటు పెంచారు.  ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరిగింది. ఇక వీకెండ్ కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు.  ఐతే నామినేషన్స్ ఐదుగురు సభ్యులలో ఒకరు ఇంటి నుండి వెళ్లిపోనున్నారు. 

bigg boss telugu elimination  this contestant going to eliminate ksr
Author
Hyderabad, First Published Nov 7, 2020, 10:36 PM IST


ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఐదుగురు ఉన్నారు. అభిజిత్, మోనాల్, హారిక, అవినాష్ మరియు అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉండగా వీరిలో ఒకరు రేపు ఆదివారం హౌస్ ని వీడనున్నారు. అభిజిత్, అవినాష్, హారికలకు ప్రేక్షకుల ఆదరణ బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. 

ఈ ముగ్గురు నామినేటైన వారిలో అధిక ఓట్లు సంపాదించుకున్నట్లు సమాచారం. అవినాష్ ఎంటరైన్మెంట్ తో అలరిస్తుండగా...మోనాల్ పై కూడా జనాల్లో కొంత సింపథీ పెరినట్లు ఉంది. ఇక అభిజిత్ కి మొదటి నుండి గట్టి ఫాలోయింగ్ తో ముందుకు వెళుతున్నారు. 

ఐదుగురిలో  అమ్మ రాజశేఖర్ తక్కువ ఓట్లు పొందారని, వీరిద్దరిలో కూడా హౌస్ నుండి వెళ్ళిపోనుంది అమ్మ రాజశేఖర్ అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. గత వారం ఎలిమినేషన్ లో మెహబూబ్ మరియు రాజశేఖర్ చివరి వరకు మిగిలారు. మెహబూబ్ ని సేవ్ చేసిన బిగ్ బాస్, అమ్మ రాజశేఖర్ ఎలిమినేటైనట్లు డ్రామా నడిపారు. ఐతే నోయల్ కోరిక మేరకు ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున అమ్మ రాజశేఖర్ ని కూడా సేవ్ చేశారు. ఈ వారం మాత్రం అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధం అయినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios