Bigg Boss Telugu 8 live Updates|Day 15: బిగ్ బాస్ హౌజ్‌లో `ప్రేమ దేశం` స్టోరీ
సారాంశం
బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 మంది హౌజ్‌లో ఉన్నారు. వీరిలో ఆ ముగ్గురి మధ్య `ప్రేమ దేశం` కథ ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
బాబోయ్ యాష్మి.. ఏంటి ఇలా బూతులు మాట్లేడేస్తోంది..
నామినేషన్స్ లో అఫ్రిదీ, ప్రేరణ, యష్మి, సోనియా ఫైర్
బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు నామినేట్ చేసే క్రమంలో వాగ్వాదానికి దిగారు. యష్మి, సోనియా, విష్ణు ప్రియా, అఫ్రిదీ, ప్రేరణ రెచ్చిపోయారు. బుర్ర లేదంటూ కామెంట్లు చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.

ఐదేళ్ల ప్రేమ, ఏడాది మోసం.. కిర్రాక్ సీత లవ్ బ్రేకప్ వెనుక షాకింగ్ స్టోరీ
మూడో వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే? ఆమెని టచ్ చేసేందుకు భయపడ్డారా?
బిగ్ బాస్ షో మొత్తం నిన్నే నామినేట్ చేస్తా, మనికంఠపై కక్ష్య కట్టిన యష్మి
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొత్తం నిన్నే నామినేట్ చేస్తానని మణికంఠని ఉద్దేశించి ప్రకటించింది యష్మి గౌడ. అతను తన ట్రస్ట్ ని, స్నేహాన్ని బ్రేక్ చేశాడని, అందుకే నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. స్నేహంగా ఈ ఇద్దరి మధ్య నామినేషన్ చిచ్చు పెట్టింది. దీంతో మణికంఠపై కక్ష్య కట్టింది యష్మి. ఈ వారం నామినేషన్‌లో ఎనిమిది మంది ఉన్నట్టు తెలుస్తుంది
ఐదేళ్ల ప్రేమ, ఏడాదిగా ఛీటింగ్.. డిప్రెషన్‌లోకి వెళ్లిన కిర్రాక్ సీత
బిగ్ బాస్ తెలుగు 8 ఆదివారం ఎపిసోడ్‌లో కిర్రాక్ సీత తన ప్రేమ కథని చెప్పింది. చిత్రం విచిత్రం గేమ్‌లో రెండు టీమ్‌లు సమానం అయిన సందర్భంగా ఎవరైనా తమ బ్రేకప్ లవ్ స్టోరీ చెబితే వాళ్లనే విన్ చేస్తానని చెప్పడంతో తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పింది సీత. ఐదేళ్లు చాలా గాఢంగా ప్రేమించుకున్నామని, ఎంతో హ్యాపీగా సాగిన తమ ప్రేమని పెద్దలు కూడా ఒప్పుకున్నారని, ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని, కానీ ప్రియుడు తనని ఛీట్ చేశాడని చెప్పింది సీత. దీంతో బ్రేకప్ చెప్పుకున్నామని, పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వెల్లడించింది. ఆ తర్వాత తాను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లినట
కొడుకుని చూడాలనుకున్నా, అందుకే పంపించారుః ఎలిమినేషన్‌పై శేఖర్ బాషా
కొడుకు పుట్టాడని తెలిసిన వెంటనే నా ఆనందానికి అవదుల్లేవు. బిడ్డని చూడాలనిపిస్తుందని చాలా మంది తోటి కంటెస్టెంట్లతో నా అభిప్రాయం పంచుకున్నా. తాను సిక్ గా ఉండటాన్ని అందరు చూశారు. అందుకే అంతా తనని ప్రేమతోనే పంపించారని ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన శేఖర్ బాషా మీడియాతో వెల్లడించారు.
సోనియాపై శేఖర్ బాషా హాట్ కామెంట్.. అది పెద్ద డ్రామా
రెండో వారంలో శేఖర్ బాషా బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బిగ్ బాస్ బుజ్‌లో మాట్లాడారు. సోనియాపై హాట్ కామెంట్ చేశారు. ఆమె స్ట్రాటజీ ప్రకారమే టార్గెట్ చేస్తుందన్నారు. మణికంఠ ఫ్యామిలీ సెంటిమెంట్ తో గేమ్ ఆడుతున్నాడని కామెంట్ చేశాడు. అలాగే సోనియా, పృథ్వీరాజ్, నిఖిల్ ల మధ్య లవ్ ట్రాక్ పెద్ద డ్రామా అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

ట్రయాంగిల్ లవ్ ట్రాక్ లో అసలు ట్విస్ట్ ఇదే!
ఆ ముగ్గురి మధ్య`ప్రేమ దేశం` లవ్ స్టోరీ..
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లో రెండో వారం ముగిసింది. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ కాగా, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఆ ముగ్గురిపై నడుస్తుంది. ఆ `ప్రేమ దేశం` కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.