Bigg Boss Telugu 7:బొంగు, పగిలిపోద్ది, మూసుకో.. పీక్కో అంటూ.. బూతులు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్..
నామినేషన్లు వస్తే చాలు.. కంటెస్టెంట్స్ కు పూనకాలు వచ్చేస్తుంటాయి. ఆవేశంతో ఊగిపోతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఈసారి మరీ బూతులతో రెచ్చిపోయారు. చివరకు బిగ్ బాస్ చేత కూడా వార్నింగ్ ఇచ్చుకునేంత ఘాటుగా మాటల తూటాలు పేలాయి.

నామినేషన్లు వస్తే చాలు.. కంటెస్టెంట్స్ కు పూనకాలు వచ్చేస్తుంటాయి. ఆవేశంతో ఊగిపోతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఈసారి మరీ బూతులతో రెచ్చిపోయారు. చివరకు బిగ్ బాస్ చేత కూడా వార్నింగ్ ఇచ్చుకునేంత ఘాటుగా మాటల తూటాలు పేలాయి.
బిగ్ బాస్ లో మరీ బూతు పురాణా పెరిగిపోతోంది. బొంగు, పగిలిపోద్ది, ఏం పీక్కుంటావ్, వేస్ట్.. ఇలా ఒక్కటేంటి... ఆవేశంలో ఎన్నెన్నో పదాలు మాట్లాడేస్తున్నారు.. ఆతరువాత వాటిని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా నామినేషన్లు వాడి వేడిగా జరిగాయి. అందులో ముఖ్యంగా.. సందీప్, అమర్ దీప్, యావర్, భోలే, గౌతమ్, ప్రశాంత్.. వీరంతా రెచ్చిపోయి మరీ... ఆవేశంలో రెచ్చిపోయారు. ఇందులో సందీప్, అమర్ లాంటివారు అనకూడని మాటలు కూడా అనేశారు. దాంతో హౌస్ అంతా గందరగోళం ఏర్పడింది.
నామినేషన్స్ ను హుందాగా జరుపుకోవాలి అనే ఆలోచన ఏ ఒక్కరిలో కనిపించలేదు. కాస్తలో కాస్త.. శివాజి పెద్దరికంగా.. వాదనలు లేకుండా నామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రతీ నామినేషన్ లో చిల్లరకగొడవలు ఎక్కువైపోయాయి. ఈరోజు ఎపిసోడ్ లో అమర్ దీప్ మొదలు పెట్టి...మొదట శివాజీతో గొడవ పడ్డాడు.. ఆతరువాత బోలేతో ఘాటుగా వాదులాటకుదిగాడు.. ఆతరువాత ప్రశాంత్ నామినేట్ చేస్తూ.. గౌతమ్ తో ఆల్మోస్ట్ నువ్వా నేనా అని ఉత్కంటగా సాగింది వారి వాదులాట. ప్రశాంత్ తో అటు అమర్ దీప్ కు కూడా పెద్ద గొడవే అయ్యింది.
ఈ మధ్యలో శివాజీని తీసుకువస్తూ.. మధ్య మధ్యలో ఇతర కంటెస్టెంట్స్ ను కూడా లాగి అనవసర గొడవలకు కారణం అయ్యారు. యావర్ నామినేట్ చేసే సమంచంలో.. సందీప్ మాస్టర్ తో పెద్ద గొడవ జరిగింది. ఆయన ఆవేశంలో సందీప్ మాస్టర్ బొంగులే అన్న పదం వాడటంతో.. అది కాస్త పెద్ద ఇష్యూ అయ్యింది. ఈ విషయాన్ని కవర్ చేయడానికి చూశాడు సందీప్. కాని అందరూ ఆయన అన్నది తప్పే అన్నారు.
సందీప్... ప్రశాంత్, భోలే, శోభా శెట్టి... యావర్, శివాజీ, భోలే... శోభా శెట్టి, గౌతమ్ లను చేశాడు. నేటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రాసెస్ వాడివేడిగా సాగింది. యావర్... సందీప్ ని నామినేట్ చేశాడు. నువ్వు సేఫ్ ప్లేయర్ అని అన్నాడు. ఈ ఇంట్లో నీకంటే సేఫ్ ప్లేయర్ ఎవరూ లేరని సందీప్ ఎదురు చెప్పాడు. నేను మొదటి వారం నుండి నామినేషన్స్ లో ఉన్నా... నువ్వు లేవు. అందుకే సేఫ్ ప్లేయర్ ని యావర్ అన్నాడు. ఇక ఈమధ్యలో బోలేకు, శోభకు వాదులాట చాలా స్ట్రాంగ్ గా జరిగింది. ఈక్రమంలో శోభా చాలా కోపంతో.. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది.
ఇక టేస్టీ తేజ నామినేషన్స్ సిల్లీగా అనిపించడంతో.. అర్జున్ అంబాటి.. చాలా కూల్ గా ఆ విషయం చెప్పే ప్రయత్నం చేశాడు.. ఆ విషయంలో తేజాను నామినేట్ కూడా చేశారు. ఇక నామినేషన్లు కంప్లీట్ అయిన తరువాత.. బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీరుమాట్లాడేటైమ్ లో.. కాస్త ఆలోచించి మాట్టాడాలి.. తప్పు పదాలు రాకుండా చూసుకుంటే మంచిది అని అన్నారు. ఇలా ఈ రోజు బిగ్ బాస్ అంతా వాడీ వేడి బూతులతో..మాటలకు మించి మాటలతో సాగింది.