Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: కీలక సమయంలో వెన్నుపోటు... శ్రీహాన్ బ్యాడ్ గేమర్ అని తేల్చేసిన శ్రీసత్య!

శ్రీసత్య తన జిగిరి దోస్త్ శ్రీహాన్ లోని బ్యాడ్ క్వాలిటీ చెప్పింది. ఇన్ని వారాలు అండగా ఉన్న శ్రీహాన్ ని కీలక సమయంలో దెబ్బతీసింది. అతడు గొప్ప గేమర్ కాదని చెప్పింది.

bigg boss telugu 6 srisatya shocking statement on sreehan
Author
First Published Nov 27, 2022, 3:49 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. ఇకపై డిప్లొమాటిక్, నైస్ గేమ్ పక్కన పెట్టేసి టైటిల్ కోసం ఆడాలని నాగార్జున సూచించాడు. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులను కలిసేందుకు సెలెబ్రిటీలు వచ్చారు. తమ వారికి మద్దతు తెలిపారు. నేడు సండే ఇంటి నుండి ఒకరు వెళ్లిపోనున్నారు. ఇక హోస్ట్ నాగార్జున ఒక విషయంలో ఇంటి సభ్యుల అభిప్రాయం అడిగారు. మీకు నచ్చని ఒక కంటెస్టెంట్, అతనిలోని బ్యాడ్ క్వాలిటీ చెప్పాలన్నారు. 

ఇనయా... రాజశేఖర్ లోని బ్యాడ్ క్వాలిటీ చెప్పింది. ఆది రెడ్డి... రేవంత్ లోని బ్యాడ్ క్వాలిటీ చెప్పారు. రాజశేఖర్... తిరిగి ఇనయాలోని బ్యాడ్ క్వాలిటీ చెప్పడం జరిగింది. శ్రీహాన్ అనూహ్యంగా రేవంత్ బ్యాడ్ క్వాలిటీ చెప్పాడు. రేవంత్.. ఫైమా లోని బ్యాడ్ క్వాలిటీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన ఊహించని పరిణామం ఏంటంటే... శ్రీసత్య తన జిగిరి దోస్త్ శ్రీహాన్ లోని బ్యాడ్ క్వాలిటీ చెప్పింది. ఇన్ని వారాలు అండగా ఉన్న శ్రీహాన్ ని కీలక సమయంలో దెబ్బతీసింది. 

అతడు గొప్ప గేమర్ కాదని చెప్పింది. స్నేహం వేరు గేమ్ వేరు. శ్రీహాన్ స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చి... గేమ్ నిర్లక్ష్యం చేస్తాడు. అదే శ్రీహాన్ లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ అని చెప్పింది. శ్రీసత్య కామెంట్ కి శ్రీహాన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కీలక సమయంలో ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటని కంగుతిన్నాడు. మీకు నచ్చని కంటెస్టెంట్ పేరు చెప్పి బ్యాడ్ క్వాలిటీ చెప్పమంటే తన పేరు చెప్పడంతో ముఖం మాడిపోయింది. 

దీంతో ముందు నుండి ఆడియన్స్ అనుకున్నదే అయ్యింది అంటున్నారు. అర్జున్ కళ్యాణ్ ని ఎలాగైతే వాడుకొని దెబ్బేసిందో, శ్రీహాన్ పరిస్థితి కూడా అదే అయ్యింది అంటున్నారు. ఈ క్రమంలో ఇకపై శ్రీసత్యతో శ్రీహాన్ ఎలా ఉంటాడనేది చూడలి. ఫ్యామిలీ వీక్ లో భాగంగా శ్రీహాన్ ని కలిసేందుకు సిరి హౌస్లోకి వచ్చింది. శ్రీహాన్ తో సన్నిహితంగా ఉంటున్న శ్రీసత్యకు ఇండైరెక్ట్ గా చురకలు వేసింది. కాగా నేడు రాజశేఖర్ ఎలిమినేట్ కానున్నారని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios