Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: ఫైనల్ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ స్పెషల్ ట్రీట్... జీవితాంతం గుర్తుండేలా ఒక అందమైన జ్ఞాపకం


బిగ్ బాస్ సీజన్ 6కి ఇది చివరి వారం. నవంబర్ 18న గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్లో ఇకపై గొడవలు, చెమట చిందించాల్సిన టాస్కులు ఉండవు. ఒకరిపై మరొకరు  కాకరేపే కామెంట్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తమ వ్యక్తిత్వం ఆడియన్స్ కి మరింత అర్థమయ్యేలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. 

bigg boss telugu 6 contestants getting memorable treatment from bigg boss
Author
First Published Dec 12, 2022, 11:51 PM IST

ఇక ఈ వారం ఓట్లు కంటెస్టెంట్స్ కి చాలా కీలకం. 14 వారాల ఓట్లతో సంబంధం లేకుండా ఈ వారం అధికంగా ఓట్లు సంపాదించిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడు. మూడు నెలలకు పైగా మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించిన కంటెస్టెంట్స్ కి గొప్ప అనుభూతిని పంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. వాళ్లకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ప్రతి కంటెస్టెంట్స్ అందమైన బిగ్ బాస్ జర్నీతో కూడిన ఫోటోలు ఏర్పాటు చేసి, దీపపు కాంతుల మధ్య కంటెస్టెంట్స్ గురించి తెలియజేస్తున్నాడు. 

రేవంత్ గురించి బిగ్ బాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోపం నీ వీక్నెస్, అది అనేక పొరపాట్లకు కారణమైంది. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకొని అందుకు తగ్గట్లు మారి కోపాన్ని ఫ్యాషన్ గా మార్చుకున్నావు. నిజానికి జీవితంలో అన్ని భావోద్వేగాలు ఉన్నవారే నిజమైన విజేతలు. జీవితంలో తండ్రి అయ్యే అద్భుత క్షణాలు దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని బిగ్ బాస్ కారణంగా కోల్పోయారు. మీ త్యాగానికి ప్రతిఫలం దక్కాలని, బిగ్ బాస్ ఫినాలేకు బిగ్ బాస్ తరపున ఆల్ ది బెస్ట్, అని చెప్పాడు. 

రేవంత్ తర్వాత శ్రీసత్యకు ఛాన్స్ వచ్చింది. గార్డెన్ ఏరియాలో శ్రీసత్య కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ సెట్ లోకి శ్రీసత్య వెళ్లారు. ఆమె బిగ్ బాస్ జర్నీని అనేక ఫోటోలలో బంధించారు. అవన్నీ చూస్తూ శ్రీసత్య మురిసిపోయింది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయ్యింది. నిజంగా పేరెంట్స్ నుండి ఫోన్ వచ్చిందని శ్రీసత్య హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ అందులో రికార్డ్ చేసిన వాళ్ళ అమ్మాయి సందేశం ఉంది. ఈ ఫైనల్ వీక్ కూడా బాగా ఆడి విజయం సాధించాలని శ్రీసత్య మదర్ చెప్పారు. 

అనంతరం శ్రీసత్య హౌస్ జర్నీ పై రూపొందించిన స్పెషల్ వీడియో ప్రదర్శించారు. అనంతరం శ్రీసత్యను బిగ్ బాస్ అభినందించారు. హౌస్లోకి వచ్చిన కొత్తలో భయాలు, సందేహాలతో నీవు సతమతమయ్యావు. బంధాల విషయంలో అయోమయం చెందావు. వాటిని అన్నింటినీ అధిగమించి ఫైనల్ వరకు వచ్చావు. అది అభినందనీయం. నీలో పోరాట స్ఫూర్తి ఉందని బిగ్ బాస్ శ్రీసత్యకు చెప్పాడు. ఫైనల్ కి దీపపు కాంతుల్లో, క్రాకర్స్ వెలుగులతో బిగ్ బాస్ కంగ్రాట్స్ చెప్పాడు. ఫైనల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ లో ఇష్టమైనది ఒకటి తీసుకెళ్లొచ్చని చెప్పగా... శ్రీసత్య ఫోటో తీసుకొని అక్కడ నుండి వచ్చేసింది. చాలా బాగా ఉందని తోటి కంటెస్టెంట్స్ తో చెప్పింది. రేపు మిగతా కంటెస్టెంట్స్ కి ఇదే తరహా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. 

 కాగా ప్రస్తుతం హౌస్లో 6గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైనల్ కి వెళ్ళేది మాత్రం ఐదుగురే. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో వెల్లడించారు. ఇంటి సభ్యుల్లో బుధవారం వరకు తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని వారం మధ్యలో బయటకు పంపుతారు. ఈ విషయం కంటెస్టెంట్స్ కి తెలియదు. కాబట్టి ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. మిడ్ వీక్ ఎలిమినేటైన కంటెస్టెంట్ తీవ్ర మనోవేదనకు గురి కావడం ఖాయం!

Follow Us:
Download App:
  • android
  • ios