Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: ఎలిమినేటైన సుదీప ఫుల్ హ్యాపీ.. వాళ్లిద్దరు మాత్రం ఏడ్చేశారు!

ఊహించిందే జరిగింది. ఆరో వారం సుదీప అలియాస్ పింకీ బిగ్ బాస్ హౌస్ వీడారు. ఉత్కంఠ మధ్య సుదీప ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో సుదీప బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి పయనమైంది.

bigg boss telugu 6 contestant sudeepa alias pinky got eliminated
Author
First Published Oct 16, 2022, 11:29 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ఆరవ వారం పూర్తి చేసుకుంది. అలాగే 6వ కంటెస్టెంట్ హౌస్ ని వీడారు. ఇక సండే కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. సరదా గేమ్స్ తో కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేశారు. మధ్య మధ్యలో ఎలిమినేషన్ ప్రాసెస్ జరుపుతూ కంటెస్టెంట్స్, ఆడియన్స్ లో ఉత్కంఠ రేపారు. ఈ వారానికి తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఇంటి సభ్యులచే ఎక్కువ ఓట్లు పొందిన కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినేట్ కావడం జరిగింది. 

వీరిలో ఒక్కొక్కరూ సేవ్ అవుతూ వచ్చారు. చివర్లో గీతూ, బాల ఆదిత్య, సుదీప మిగిలారు. ఇసుక నింపిన కుండీలు ఆ ముగ్గురి ముందుంచిన నాగార్జున పేరు చెప్పినప్పుడు ఇసుక లోపల ఉన్న బిళ్ళను తీయాలి అన్నారు. ముందుగా బాల ఆదిత్య పేరు పిలవగా ఆయన బిళ్ళ తీశారు. దానిపై అన్ సేఫ్ అని రాసుంది. తర్వాత గీతూ తీయడంతో సేఫ్ అని రాసున్న బిళ్ళ వచ్చింది. అనంతరం సుదీప కుండీలో ఉన్న బిళ్ళపై కూడా అన్ సేఫ్ అని రాసుంది. దీంతో గీతూ సేవ్ అయ్యింది. 

బాల ఆదిత్య, సుదీపలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ ఏర్పడింది. స్టోర్ రూమ్ లో ఉన్న రెండు బ్యాటరీలు తెప్పించిన నాగార్జున బ్యాటరీలకు ఉన్న వైట్ పార్ట్స్ కి రెండు క్లిప్స్ తగిలించాలి అన్నాడు. అప్పుడు స్క్రీన్ పై మీ బ్యాటరీ చార్జెస్ కనిపిస్తాయి . తక్కువ రీఛార్జ్ ఉన్నవారు ఎలిమినేటైనట్లని నాగార్జున వెల్లడించారు. ఈ ప్రక్రియలో సుదీప్ బ్యాటరీ జీరో ఛార్జ్ తో రెడ్ చూపించింది. బాల ఆదిత్య బ్యాటరీ ఛార్జింగ్ తో గ్రీన్ మార్క్ చూపించింది. దాంతో సుదీప ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

సుదీప ఎలిమినేషన్ కావడంతో మెరీనా, బాల ఆదిత్య కన్నీరు పెట్టుకున్నారు. వేదికపైకి వెళ్లిన సుదీప తన జర్నీ చూశారు. ఆమె హ్యాపీగానే హౌస్ ని వీడారు. నా భర్త రంగనాథ్ రెండు వారాల కంటే ఎక్కువ ఉండవన్నారు. కానీ నేను ఆరు వారాలు ఉన్నాను. పైగా హౌస్లో చాలా విషయాలు నేర్చుకున్నానని హోస్ట్ నాగార్జునతో చెప్పారు. ఇంటి సభ్యుల నేచర్ ఆధారంగా అక్కడ ఉంచిన కూరగాయలతో పోల్చాలని నాగార్జున చెప్పారు. సుదీప అది చేయడానికి కొంచెం సంశయించింది. అయినప్పటికీ చాలా వరకు సాఫ్ట్ గా పాజిటివ్ నోట్ లో  పూర్తి చేసి బై బై చెప్పేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios