ఎఫైర్స్ నే నమ్ముకుని ఇనయా గేమ్ ఆడుతున్నట్లు అర్థం అవుతుంది. ఆమె హౌస్ లో నాన్ స్టాప్ రొమాన్స్ కురిపిస్తుంది. స్పైసీ కంటెంట్ కోసమైనా నిర్వాహకులు కొనసాగిస్తారని మెంటల్ గా ఫిక్సయిపోయింది. ఐతే నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ లో ఎవరి స్ట్రాటజీలు వాళ్లకు ఉంటాయి. ఇనయా స్ట్రాటజీ మాత్రం లవ్ ఎఫైర్స్. గతంలో ఈ ఫార్ములా బాగా వర్క్ అవుట్ అయ్యింది. జంటలుగా ఉన్న కంటెస్టెంట్స్ ఫైనల్ కి కూడా వెళ్లారు. కొందరైతే టైటిల్స్ అందుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ లాంటి వాళ్ళు ఇందుకు ఉదాహరణ. కాగా ఇనయా గేమ్ ప్లాన్ ఇదే అని తెలుస్తుంది. రెండు వారాలుగా ఆమె ఫోకస్ పూర్తిగా సూర్యతో రొమాన్స్ చేయడం పైనే పెట్టింది. అతనితో ముద్దు ముచ్చట్లు ఆడుతూ హ్యాపీగా గడిపేస్తుంది. ఒక అబ్బాయితో లవ్ ఎఫైర్ పెట్టుకోవడం బోల్డ్ విషయం.
కెమెరాల ముందు రొమాన్స్ కురిపించాలి అంటే గట్స్ ఉండాలి. ముఖ్యంగా పేరెంట్స్, సమాజాన్ని వదిలేయాలి. ఎలాగైనా కొన్ని వారాలు హౌస్లో ఉండాలని ఫిక్స్ అయిన ఇనయా ఓపెన్ గా సూర్యతో రొమాన్స్ చేస్తుంది. ఇద్దరూ ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటున్నారు. ఇనయా చప్పరించిన లాలిపాప్ సూర్య తినడం దారుణమైన పరిణామం.
గేమ్స్, టాస్స్ ఆడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైనర్ చేస్తూ రొమాన్స్ చేస్తే నిర్వాహకులకు నో ప్రాబ్లం. కానీ అడల్ట్ కంటెంట్ నే నమ్ముకుంటే ప్రయోజనం ఉండదు. శనివారం హోస్ట్ నాగార్జున అదే చెప్పాడు. పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మనుషులతో పాటు గేమ్ పైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పాడు. దీంతో ఇనయా ప్లాన్ కొంచెం రివర్స్ అయ్యింది. ఆమెకు తన నెక్స్ట్ స్టెప్ ఏమిటో అర్థం కావడం లేదు. ఈ వారం ఇనయా నామినేషన్స్ లో లేదు. కాబట్టి నో ప్రాబ్లమ్. ఇకపై ఇనయా రొమాన్స్ తగ్గించి కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేస్తేనే ప్రేక్షకులు ఓట్లు వేస్తారు. లేదంటే తట్టాబుట్టా సర్దుకుని వచ్చేయాల్సిందే.
