బిగ్ బాస్ షో మెల్లగా చివరి అంకానికి చేరుతుంది. మరో కొన్ని వారాలలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో లాస్య, అఖిల్, అభిజిత్, సోహైల్, అవినాష్, హారిక, ఆరియానా మరియు మోనాల్ ఉన్నారు. వీరందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉండగా వచ్చే వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారనుంది. 

ఇక ఈవారం మహబూబ్ దిల్ సే ఎలిమినేటైన సంగతి తెలిసిందే. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో అతి తక్కువ ఓట్లు పొందిన మెహబూబ్ ఇంటిని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటికి వచ్చిన మెహబూబ్ బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. హోస్ట్ రాహుల్ తో ఇంటి సభ్యుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అమ్మ  రాజశేఖర్ పిల్లాడిలా చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతాడని చెప్పాడు. కెప్టెన్ గా తాను చెప్పింది చేయాలని కోరుకుంటాడని మెహబూబ్ అన్నారు. 

ఇక దివి స్ట్రైట్ ఫార్వర్డ్ అని, చెప్పాలనుకున్నది ముఖం మీద చెప్పేస్తుందని అన్నాడు. ఐతే టాస్క్, గేమ్స్ విషయంలో పెద్దగా ఎఫ్ఫార్ట్స్ పెట్టదని మెహబూబ్ దివి గురించి అన్నాడు. ఇక లాస్య గురించి మెహబూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లాస్యను ఎవరైనా తిడుతున్నా నవ్వుతుంది. ఆమెకు ఫైట్ చేయాలని ఉండదని మెహబూబ్ అన్నాడు. 

ఇంటిలో ఇంతకి ఎన్ని లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయని రాహుల్ అడుగగా...నాకు తెలియదంటూ నవ్వేశాడు మెహబూబ్. నీ నవ్వు చూస్తుంటేనే అర్థం అవుతుందని రాహుల్ అన్నాడు. మొన్నటి వరకు హౌస్ లో అఖిల్, మోనాల్ మధ్య లవ్ ట్రాక్ హైలెట్ కాగా , ఈ మధ్య అభిజిత్ హరికకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ ఒకరిని మరొకరు కాపాడుకుంటూ, సన్నిహితంగా ఉంటున్నారు.