Asianet News TeluguAsianet News Telugu

మీకు వినోదం మాత్రమే మాకు జీవితం, తేలిగ్గా తీసేయకండి... బిగ్ బాస్ సోహెల్ ఆవేదన!


బిగ్ బాస్ సోహెల్ లక్కీ లక్ష్మణ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకు సోహెల్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. 
 

bigg boss sohel warm request to his trollers
Author
First Published Jan 3, 2023, 11:34 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సోహెల్ సెకండ్ రన్నర్ గా నిలిచాడు. ఫినాలేలో టాప్ 3 కంటెస్టెంట్స్ గా సోహెల్, అఖిల్, అభిజీత్ నిలిచారు. టైటిల్ గెలిచేది ఒకరే కాబట్టి... రూ. 10 లక్షలు తీసుకొని ఒకరు రేసు నుండి తప్పుకోవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ తీసుకున్న సోహెల్ రూ. 10 లక్షల సూట్ కేసుతో హౌస్ నుండి బయటకు వచ్చాడు. సీజన్ 4 ఫినాలే గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సోహెల్ కి మరో రూ. 10 లక్షలు ఆఫర్ చేశాడు. మొత్తంగా రూ. 25 లక్షల వరకూ సోహెల్ అందుకున్నాడు. 

అయితే ఫినాలేకి ముందు హౌస్లోకి వెళ్లిన సోహెల్ ఫ్రెండ్ మెహబూబ్ అతనికి పొజిషన్స్ లీక్ చేశాడని, నీది 3వ స్థానం అని వేళ్ళతో సైగ చేసి చూపించాడని, అందుకే సోహెల్ తెలివిగా సూట్ కేసు తీసుకొని లాభ పడ్డాడని విమర్శలు వెల్లువెత్తాయి. సోహెల్-మెహబూబ్ కలిసి స్కామ్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మెల్లగా సద్దుమణిగిన ఈ ఆరోపణలు లక్కీ లక్ష్మణ్ విడుదల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ వేడుకలో సోహెల్ ఈ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. 

నేనేమి దొంగతనం చేయలేదు. నాగార్జున గారు ఆఫర్ చేసిన డబ్బులు తీసుకొని బయటకు వచ్చాను. నా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రూ. 25 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఆ డబ్బులతో మా చెల్లి పెళ్లి చేశాను. నా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే వెతికి మరీ తంతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక డిసెంబర్ 30న విడుదలైన లక్కీ లక్ష్మణ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. 

ఈ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్లకు సోహెల్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ''సినిమా చూసేవాడి కి వినోదం మాత్రమే కానీ, చేసేవాడికి జీవితం. దయచేసి తీసిపారేయకండి'' అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు . సోహెల్ కామెంట్ వైరల్ అవుతుంది. దర్శకుడు, నిర్మాత, హీరో కలలు, కష్టం, జీవితం ఒక సినిమాపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి తేలికగా కొట్టిపారేయకండి... అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. 

ఏ ఆర్ అభి దర్శకత్వంలో లక్కీ లక్ష్మణ్ తెరకెక్కింది. సోహెల్ హీరోగా మరో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీలో నటిస్తున్నాడు. అలాగే మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిల్ తో మరో మూవీ తెరకెక్కుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios