Asianet News TeluguAsianet News Telugu

Sohel : మోకాళ్ళ పై నిల్చొని వేడుకున్న బిగ్ బాస్ సోహెల్.. ‘బూట్ కట్ బాల్ రాజ్’ ఈవెంట్ లో కన్నీళ్లు...

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ Sohel నెక్ట్స్ ‘బూట్ కట్ బాలరాజ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తాజా ఈవెంట్ లో సోహెల్ మోకాళ్లపై నిల్చొని ప్రేక్షకులను వేడుకోవడం ఆసక్తికరంగా మారింది.
 

Bigg Boss Sohel Upcoming film Bootcut Balraju NSK
Author
First Published Jan 30, 2024, 10:51 AM IST

Bigg Boss ఫేమ్, నటుడు సోహెల్ ప్రస్తుతం హీరోగా అలరిస్తున్న విషయం తెలిసిందే. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఇక తన నెక్ట్స్ సినిమా ‘బూట్ కట్ బాలరాజ్’ Bootcut Balarajuతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు తానే ప్రొడ్యూసర్ కావడం విశేషం. ఫిబ్రవరి 2న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. 

ఇదిలా ఉంటే... బూట్ కట్ బాలరాజ్ ప్రమోషన్స్ కోసం సోహెల్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తానే ప్రొడ్యూసర్ కావడంతో అయినంత వరకు సినిమాను ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈవెంట్ ను కూడా నిర్వహించారు.  ఈ సందర్భంగా సోహెల్ వేదికపై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం సోహెల్ మాటలు ఆసక్తికరంగా మారాయి. 

సోహెల్ మాట్లాడుతూ... ‘ఈ సినిమాకు నేనే ప్రొడ్యూస్ చేశానని.. పెద్ద ఎత్తున పబ్లిసిటీ  చేసేందుకు నా దగ్గర పైసల్ లేవు. ఇదే నా ప్లాట్ ఫాం. మీమల్ని ఇంత కంటే ఎలా అడగాలో తెలియడం లేదు. అన్నీ ప్రయత్నాలు చేశాను. ఫిబ్రవరి 2న నా సినిమాను చూడండి.’.. మోకాళ్లపై కూర్చొని ప్రేక్షకులను వేడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ సోహెల్ కు సపోర్ట్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా సినిమా కనెక్ట్ అయితే కుమ్మేస్తామని హామీనిస్తున్నారు. 

ఇక ఈ చిత్రాన్ని శ్రీ కోనేటి నిర్మించారు. గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్ పై రూపుదిద్దుకుంది. మేఘ లేఖ హీరోయిన్ గా అలరించబోతోంది. సునీల్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios