Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ ఫేం టేస్టీ తేజాకు హార్ట్ ఎటాక్, షాక్ లో ప్రియాంక జైన్, ఏం చేశారంటే..?

బిగ్ బాస్ ఫేమ్.. బుల్లితెర నటుడు, కమెడియన్ టేస్టీ తేజ హార్ట్ ఎటాక్ కు గురయ్యాడు. ఆ టైమ్ లో అక్కడే ఉన్నారు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్.. అయితే అక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే..? 

Bigg Boss Fame tasty teja suffered from heart attack and Priyanka Jain Crying prank Video Viral JMS
Author
First Published Jan 29, 2024, 5:36 PM IST


బిగ్ బాస్ తో బాగా ఫేమస్ అయ్యాడు టేస్టీ తేజ. బుల్లితెరపై అతనికి బాగా పాలోయింగ్ ఉంది. జబర్థస్త్ కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన తేజా.. ఆతరువాత య్యూట్యూబర్ గా మారాడు.. ఫుడ్ వీడియోలు చేస్తూ.. సెలబ్రిటీల ను ఇంటర్వ్యూలు చేస్తూ..వారికి రకరకాల రుచులు చూపిస్తూ.. వైరల్ అయ్యాడు. టేస్టీ తేజా వీడియోలుకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కూడా సందడి చేశాడు తేజా.. ఫైనల్స్ కు మూడు వారాల ముందే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. 

ఇక యూట్యూబర్ గా మంచి పేరున్న తేజ గురించి తెలియనివారు ఉండరు. ఇక తాజాగా తేజాకి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు  తెలుస్తోంది. అవును ఈ విషయం మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తన యూబ్యూబ్ ఛానెల్ లో పెట్టిన వీడియోద్వారా తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రియాంక జైన్.. ఆమె ప్రియుడు శివకుమార్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. కాని ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. రీసెంట్ గా ప్రియాంక జైన్- శివకుమార్ లను కలిసేందుకు వారింటికి వెళ్లాడు  టేస్టీ తేజా. వాళ్ళను కలవడంతో పాటు.. ఓ  వీడియో కూడా చేసుకోవచ్చు అనుకున్నాడు. అయితే ప్రియాంకతో కాసేపు మాట్లాడి.. ఆతరువాత ఎలాగా తనది వంటల ఛానెల్ ఏ కదా.. వంటలో సాయం చేయొచ్చు అనకున్నాడు. 

 

ఈలోగ ప్రియాంక జైన్ ప్రియుడు  శివకుమార్ తేజాకి ఓ  స్పెషల్ జ్యూస్ ఇస్తాడు. కర్బూజతో తయారు చేసిన ఆ జ్యూస్  తాగిన తర్వాత తనకు ఏదో అనీజీగా ఉందని తేజా చెప్తాడు. అయినా వీళ్లు వంటగదిలో పనులు ప్రారంభిస్తారు. క్యారెట్లు కోస్తున్న సమయంలో తేజా తనకు బాలేదు అంటూ.. గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలతాడు. తనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటూ చెప్తాడు. దాంతో  ప్రియాంక జైన్ చాలా భయపడిపోతుంది. ఎంతో కంగారు పడి పోతుంది. తేజాకు ఏమైందా అని బోరుమంటుంది. 

ఇక్కడే ఉంది అసలు విషయం తేజాకు అసలే ఏం కాలేదు. ఈ వీడియోలో తేజా అలా అయిపోతున్నా..  శివకుమార్ మాత్రం ఎంతో రిలాక్స్డ్ గా ఉంటాడు. తేజాకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదు. ప్రియాంకను సరదాగా ఆట పట్టించడం కోసం.. శివకుమార్ , తేజాతో కలిసి చేసిన  ప్రాంక్ ప్లాన్ ఇది.  అయితే తేజాకు ఇలా అయిపోవడంతో ప్రియాంక విలవిలలాడుతుంది. అబులెన్స్ కు ఫోన్ చేయకుండా శివ పోన్లు అన్నీ దాచేస్తాడు. దాంతో ప్రియాంక కంగారుపడి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తేజా ఆగలేక అసలు విషయం చెప్పడంతో రిలాక్స్ అవుతుంది ప్రియాంక. ఇక ఇలాంటి ప్రాంక్ చేసినందకు శిను కొడుతుంది. అయితే ఈ వీడియో ముందే అసలు విషయం ఆడియన్స్ కు చెప్పారు శివ, తేజా.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు కూడా. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios