Asianet News TeluguAsianet News Telugu

వైల్డ్ డాగ్ ప్రొమోషన్స్ జోరు... బిగ్ బాస్ గంగవ్వను బరిలోకి దింపిన నాగ్!

బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ ఇంటర్వ్యూలో నాగార్జున పాల్గొన్నారు. వైల్డ్ డాగ్ ప్రొమోషన్స్ కోసం గంగవ్వను కూడా దించడం ఆశ్చర్యం కలిగించే అంశమే. నాగార్జున హోస్ట్ గా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. షో ద్వారా మంచి పాపులారిటీ రాబట్టిన గంగవ్వ, అనారోగ్య కారణాలతో హౌస్ నుండి బయటికి వచ్చేశారు.

bigg boss fame gangavva interview with nagarjuna for wild dog ksr
Author
Hyderabad, First Published Mar 18, 2021, 11:05 AM IST


వైల్డ్ డాగ్ మూవీతో గట్టిగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు నాగార్జున. అందుకే ఆయన వైల్డ్ డాగ్ చిత్రాన్ని భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదలకు సమయం దగ్గర పడు తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. వివిధ మాద్యమాలలో వైల్డ్ డాగ్ టీమ్ తో పాటు ఇంటర్వ్యూలలో నాగార్జున పాల్గొంటున్నారు. ఇటీవలే శ్రీముఖి... నాగార్జున మరియు వైల్డ్ డాగ్ క్యాస్ట్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ ఇంటర్వ్యూలో నాగార్జున పాల్గొన్నారు. వైల్డ్ డాగ్ ప్రొమోషన్స్ కోసం గంగవ్వను కూడా దించడం ఆశ్చర్యం కలిగించే అంశమే. నాగార్జున హోస్ట్ గా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. షో ద్వారా మంచి పాపులారిటీ రాబట్టిన గంగవ్వ, అనారోగ్య కారణాలతో హౌస్ నుండి బయటికి వచ్చేశారు. నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వ ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఇవ్వడం జరిగింది.


 
ఇక వైల్డ్ డాగ్ ట్రైలర్ అద్భుతం అంటూ మహేష్, చిరంజీవి సైతం మెచ్చుకున్నట్లు నాగార్జున తెలిపారు. వారితో జరిపిన వాట్స్ యాప్ ఛాటింగ్ నాగార్జున బయటపెట్టారు. వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటిస్తున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆయన రోల్ ఉండనుంది. ఇక వైల్డ్ డాగ్ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ విడుదల కానుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios