Asianet News TeluguAsianet News Telugu

నన్ను వదిలేశావు జీవితం దారుణంగా తయారైంది... ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన దీప్తి సునైన!

దీప్తి సునయన కన్నీరు పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. మీరు నన్ను బహిష్కరించారు. నా జీవితం దుర్భరం అయ్యిందంటూ ఆ వీడియోలో బాధపడ్డారు.

bigg boss fame deepthi sunaina shares an emotional video
Author
First Published Mar 17, 2023, 7:13 PM IST

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి విడిపోయిన నేపథ్యంలో దీప్తి వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు నన్ను బహిష్కరించారు. నా జీవితం దుర్భరంగా తయారైంది అంటూ ఆ వీడియోలో వెల్లడించడం జరిగింది. దీప్తి ఎమోషనల్ వీడియో వైరల్ అవుతుంది. 

 దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయి చాలా కాలం అవుతుంది. 2021లో దీప్తి సోషల్ మీడియా వేదికగా తమ బ్రేకప్ మేటర్ రివీల్ చేశారు. కారణాలు వివరించకున్నప్పటికీ... షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పినట్లు అభిమానులతో పంచుకున్నారు. కాగా సిరి హన్మంత్ వలనే విడిపోయారన్న మాట గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి సన్నిహితంగా మెలిగారు. చెప్పాలంటే స్నేహితులమని చెప్పుకుంటూ ప్రేమికులకు మించి రొమాన్స్ చేశారు. 

ఇదంతా బయట నుండి గమనిస్తున్న దీప్తి మనసు గాయపడిందని, తాను అమితంగా ప్రేమించే వ్యక్తి మరొకరికి దగ్గరైనందుకు దీప్తి హర్ట్ అయ్యారని కథనాలు వెలువడ్డాయి. బిగ్ బాస్ షో ముగిసిన అనంతరం దీప్తి బ్రేకప్ ప్రకటన చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. అప్పటి నుండి దీప్తి-షణ్ముఖ్ విడివిడిగా ఉంటున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. షణ్ముఖ్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిజిటల్ సిరీస్లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు. 

కాగా షణ్ముఖ్ తన ఎక్స్ లవర్ దీప్తికి షాక్ ఇస్తూ కొత్త పార్ట్నర్ ని వెతుక్కున్నాడు. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'అయ్యయ్యో'లో షణ్ముఖ్ లవర్ గా ఫణి పూజిత నటిస్తున్నారు. ఇటీవల అయ్యయ్యో ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. దీప్తితో బ్రేకప్ కావడంతో చేసేది లేక తన ప్రాజెక్ట్స్ కి షణ్ముఖ్ వేరే అమ్మాయిలను ఎంచుకుంటున్నారు. షణ్ముఖ్ లవర్ గా రొమాన్స్ చేయాల్సిన దీప్తి మనస్పర్థలతో దూరమయ్యారు. ఇక అయ్యయ్యో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

గతంలో ప్రాజెక్ట్ ఏదైనా షణ్ముఖ్-దీప్తి చేసేవారు. దీప్తితో విడిపోయాక షణ్ముఖ్ ఇతర అమ్మాయిలను ఎంచుకుంటున్నారు. బ్రేకప్ కారణంగా ఇద్దరూ నష్టపోయారనే వాదన ఉంది. దీప్తి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఇక షణ్ముఖ్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఉన్నారు. షణ్ముఖ్ ఫైనల్ కి వెళ్లడంతో పాటు రన్నర్ గా నిలిచాడు. సన్నీతో పోటీపడ్డ షణ్ముఖ్ రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios