Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పద వేణు స్వామితో అషురెడ్డి పూజలు... మెడలో దండ వేయించుకుని, కాళ్ళు మొక్కి!

బిగ్ బాస్ అషురెడ్డి సైతం వేణు స్వామిని ఆశ్రయించింది. ప్రత్యేక పూజలు నిర్వహించింది. అషురెడ్డి-వేణు స్వామి కలిసి పూజలు చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. 
 

bigg boss fame ashureddy performs pooja with venu swamy video goes viral ksr
Author
First Published Feb 9, 2024, 3:01 PM IST

వేణు స్వామి అంటే తెలియని వారుండరు. చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఈయన పాపులర్ అయ్యాడు. వేణు స్వామి చెప్పే జాతకాలు సదరు హీరోలు, సెలెబ్స్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఉంటాయి. అందుకే వేణు స్వామిని వివాదాస్పద జ్యోతిష్యుడు అంటారు. అయితే వేణు స్వామి చెప్పే జాతకాలను నమ్మే బడా బాబులు ఉన్నారు. వ్యాపారవేత్తలు, స్టార్ హీరోయిన్స్, హీరోలు, నటులు అతని కస్టమర్స్. 

వేణు స్వామితో లక్షలు ఖర్చు చేసి పూజలు చేయించుకుంటారు. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, ఇనయ సుల్తానాతో పాటు పలువురు సెలెబ్స్ వేణు స్వామితో పూజలు జరిపించుకున్నారు. వేణు స్వామి చేసే పూజ వలన కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని వారు నమ్ముతున్నారు. వేణు స్వామి దగ్గర వివిధ రకాల పూజల మెనూ ఉంటుంది. పూజను బట్టి రేటు ఉంటుంది. పూజలో మద్యం, మాసం కూడా పెడతారట. 

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి కూడా వేణు స్వామితో పూజ చేయించారు. రాజశ్యామలాదేవి, బగళాముఖీ దేవీలకు పూజలు నిర్వహించారు. అషురెడ్డి మెడలో వేణు స్వామి దండ వేయగా... ఆమె ఆయన కాళ్ళకు మొక్కింది. వేణు స్వామి చేసే పూజ పట్ల అషురెడ్డికి ఎంత నమ్మకం ఉందో చెప్పేందుకు ఈ వీడియో నిదర్శనం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అషురెడ్డి పూజ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. 

అషురెడ్డి బిగ్ బాస్ 3లో పాల్గొంది. ఆ మధ్య బుల్లితెర షోల్లో సందడి చేస్తుంది. నటిగా సినిమాలు చేస్తున్న అషురెడ్డి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కాగా, అషురెడ్డి పేరు వినిపించింది. అనవసరంగా తన పేరు లాగడంతో రోజుకు వందల కాల్స్ వస్తున్నాయని అషురెడ్డి అసహనం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Follow Us:
Download App:
  • android
  • ios