మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ పై లండన్ లో ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ పై లండన్ లో ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''నేను పార్క్ లో నడుచుకుంటూ వెళ్తుండగా.. నాకు కొంచెం దూరంలో ఓ వ్యక్తి మహిళను వేధిస్తున్నాడు. ఆమెని కొడుతుండడం చూడలేకపోయాను. అక్కడకి వెళ్లి ఆమెని కాపాడే ప్రయత్నం చేశాను. అతడిని పక్కకి తోసేసి ఆమెని కాపాడాను.

ఆ సమయంలో అతడు నాపై ఎటాక్ చేశాడు. నా ముఖంపై బలంగా కొట్టడంతో గాయాలయ్యాయి. నేను అతడిని కింద పడేసి వెంటనే పోలీసులను పిలిచాను. దాంతో అతడు పారిపోయాడు. అతడు పారిపోయిన కొద్ది సేపట్లోనే పోలీసులు అతడిని పట్టుకొని జైలులో వేశారు.

నాకు గాయాలు అయినప్పటికీ ఆ మహిళను కాపాడినందుకు సతోషంగా ఉంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఆమె సాహసాన్నిమెచ్చుకుంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.