అరియానా కు గాయాలు.. ముక్కు అవినాష్ పై మండిపడిన నటి
బుల్లితెర తార అరియానా గ్లోరీ గాయపడింది. తనకు గాయం అవ్వడానికి కారణం ఎవరో కూడా వెల్లడించింది బ్యూటీ. ముక్కు అవినాష్ పై మండిపడుతూ.. సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది.
బిగ్ బాస్ బ్యూటీ.. బుల్లితెర స్టార్ అరియానా గ్లోరీకి గాయం అయ్యింది. ఓ ప్రోగ్రామ్ షూటింగ్ లో భాగంగా ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. అంతే కాదు తను ఇలా గాయాల పాలు అవ్వడానికి కారణం కూడా తెలిపింది బ్యూటీ. ముక్కు అవినాష్ వల్లే తనకు ఇలా గాయాలు అయ్యాయని వెల్లడించింది బ్యూటీ. తన చేతికి తగిలిన గాయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా చూపిస్తూ.. అవినాష్ కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చింది అరియాన. మిస్టర్ ముక్కు అవినాష్ గారు చూడండి..డాన్స్ లో, పెర్ఫార్మెన్స్ లో పక్కన ఉన్న ఆర్టిస్టులను పట్టించుకోకుండా.. మీ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ తో పెర్ఫార్మ్ చేస్తే అవతలి వాళ్ళు ఎలా బలవుతారో.. బీబీ జోడిలో చేసిన పెర్ఫార్మెన్స్ కి నా చెయ్యి చూడండి… ఇలా దెబ్బ తగిలి కమిలిపోయింది అంటూ వెల్లడించింది అరియాన.
అంతే కాదు ఈ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అవినాష్ గారు అంటూ.. ఫన్నీగా స్పందించింది అరియాన. ప్రస్తుతం అరియాన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుననారు. అరియాన కెరీర్ కోసం చాలా కష్టపడుతందంటూ కొంత మంది కామెంట్ చేస్తుంటే.. మా అరియానకు ఇలా దెబ్బ తగిలేలా చేస్తావా...? అంటూ మరికొంత మంది అవినాష్ పై ఫైర్ అవుతున్నారు.
కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది అరియాన. ఛానల్స్ కు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయ్యింది. ఇదే క్రమంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ అరియాన లైఫ్ ను టర్న్ చేసింది. ఆమెను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది.బోల్డ్ గా చేసిన ఇంటర్వ్యూ వల్ల కొన్ని విమర్షలు ఫేస్ చేసినా.. అదే ఇంటర్వ్యూతో ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో.. అరియాన చేసిన రచ్చ ఇక అందరికి తెలిసిందే. ఆమె గేమ్ ఆడిన తీరు కూడా చాలా మంది ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది.
బిగ్ బాస్ లో టాప్ 5లో నిలిచింది అరియాన. బిగ్ బాస్ తర్వాత అరియానా రేంజ్ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఈ ఇమేజ్ తో బుల్లితెర పై అరియానకు మరిన్ని ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. ఇక అప్పుడుప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది బ్యూటీ. బిగ్ బాస్ తరువాత బిగ్ బాస్ జోడీ బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో జోడీల డాన్స్ లతో అదిరిపోయోలా రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఈక్రమంలో అరియాన.. అవినాష్ తో కలిసి పెర్ఫామెన్స్ ఇస్తోంది. ఈక్రమంలోనే గాయపడింది.