Asianet News TeluguAsianet News Telugu

నా భర్తను వెన్నుపోటు పొడిచారు.. బిగ్ బాస్ బాలాదిత్య భార్య షాకింగ్ కామెంట్స్‌

బిగ్ బాస్ ఈసారి రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నవన్నీ తారుమారు అవ్వడంతో అందరి ఆటల్లో మార్పులు తపడంలేదు. ఈ క్రమంలో బయట నుంచి కంటస్టెంట్స్ కు సంబంధించిన వారు స్పందిస్తున్నారు. రీసెంట్ గా బాలదిత్య భార్య స్పందిస్తూ.. సంచల వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss Baladitya Wife Shocking Comments
Author
First Published Sep 22, 2022, 7:03 PM IST

బిగ్ బాస్ ఈసారి రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నవన్నీ తారుమారు అవ్వడంతో అందరి ఆటల్లో మార్పులు తపడంలేదు. ఈ క్రమంలో బయట నుంచి కంటస్టెంట్స్ కు సంబంధించిన వారు స్పందిస్తున్నారు. రీసెంట్ గా బాలదిత్య భార్య స్పందిస్తూ.. సంచల వ్యాఖ్యలు చేశారు. 

బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యి..అందరికి సుపరిచితుడైన బాలాదిత్య.. ఆతరువాత కాస్త డల్ అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చినా..సినిమాలు సరిగ్గా రాకపోవడంతో.. ప్రస్తుతం కనిపించకుండా పోయాడు. ఇక రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో బాలాదిత్య ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తెలుగు తెరపై చాలా కాలం వందల సినిమాలతో అలరించిన బాలాదిత్య.. సెకండ్ ఇన్నింగ్స కోసం బిగ్ బాస్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన మార్క్ గేమ్ తో సందడి చేస్తున్నాడు బాలాదిత్య. 

హౌస్ లో  చాలా సౌమ్యంగా ఉంటూ..  తన ఆట ను ఎవరికీ అర్ధం కాకుండా ఆడుతున్నాడు బాలాదిత్య. చాలా మంది నుంచి  ప్రశంసలు కూడా దక్కుతున్నాయి యంగ్ స్టార్ కు. ప్రశంసలతో పాటు.. ట్రోల్స్ కూడా తప్పడంలేదు  బాలాదిత్యకు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టులో ప్రకాశ్ రాజులా అతి మంచితనం ఉందంటూ కొందు.. కాదు కాదు  మంచితనంను నటిస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా బాలాదిత్య భార్య.. రీసెంట్ గా ఓ  ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  బాలాదిత్య రియల్ గా ఎలా కనిపిస్తాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాడంటూ బాలాదిత్య భార్య పేర్కొన్నారు. ఆయన మొదటి నుండి సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు, ఇప్పుడు అలాగే బిగ్‌ బాస్ లో కూడా ఉంటున్నారు అని క్లారిటీ ఇచ్చింది మిసెస్ బాలాదిత్య. 

అంతే కాదు మరికొన్ని సంచలన విషయాలు కూడా మాట్లాడింది ఆమె. బిగ్‌ బాస్‌ హౌస్ లో కొందరు తన భర్తకి వెన్ను పోటు పొడుస్తున్నారని.. అలానే ఆడుతున్నారని.. ఆయన మంచితనాన్ని వాడుకొంటున్నారంటూ..బాధపడింది. అంతే కాదు కొన్ని టాస్క్ ల్లో బాలా నమ్మిన వారే మోసం చేయడం కాస్త బాధ కలిగించిందంటూ బాలాదిత్య భార్య అన్నారు. తన భర్త తప్పకుండా టాప్‌ 5 లో ఉంటాడన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యాక్తం చేసింది బాలాదిత్య భార్య. 

ఇక రీసెంట్ గానే బాలాదిత్య భార్య పండండి  పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టగానే కొన్ని రోజులు కూడా చూడకుండా తన భర్త  వెంటనే  బిగ్ బాస్‌ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చిందని. తలుచుకుంటేనే  ఆ ఫీలింగ్ కాస్త ఇబ్బందిగా ఉంది అంటు ఆమె ఎమోషనల్‌ అయ్యింది. అంతే కాదు బాలాదిత్య ఎప్పుడూ నెంబర్ వన్ గాఉండాలని  తాను కోరుకుంటున్నట్టు చెప్పింది. బిగ్ బాస్ విన్నర్ గా తిరిగిరావాలని కోరకుంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. 

Follow Us:
Download App:
  • android
  • ios