Asianet News TeluguAsianet News Telugu

దొంగతనం చేసి బ్యాగ్ నిండా డబ్బుతో పారిపోయిన బిగ్ బాస్ విన్నర్ సన్నీ, తెగించాడుగా.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్

బుల్లితెర నటుడిగా పాపులర్ అయిన వీజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ క్రేజ్ ఉపయోగించుకుని ప్రస్తుతం సినిమాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు.

Bigg Boss 5 winner VJ Sunny  shocking cctv video viral
Author
First Published Jan 5, 2023, 5:35 PM IST

బుల్లితెర నటుడిగా పాపులర్ అయిన వీజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ క్రేజ్ ఉపయోగించుకుని ప్రస్తుతం సినిమాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ 5లో సన్నీ అద్భుతంగా టాస్క్ లలో పెర్ఫామ్ చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. ఫలితంగా అతడు విజేతగా నిలిచాడు. 

వివాదలకు దూరంగా ఉండే సన్నీ గురించి తాజాగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వైరల్ గా మారింది. వీజే సన్నీ ఒక చోట దొంగతనం చేసి పారిపోతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది సిసిటివి ఫుటేజ్ లాగా ఉంది. వీజే సన్నీ కారు ఆ ప్రాంతంలో ఆగుతుంది. వెంటనే సన్నీ కారు దిగి పరిగెత్తుకుంటూ వెళతాడు. తిరిగి ఒక బ్యాగుతో పరిగెత్తుకుంటూ తన కారు వైపు వస్తాడు. 

ఆ బ్యాగు నిండా డబ్బు ఉంది. పరిగెత్తే క్రమంలో బ్యాగులో డబ్బు కొంత కింద పడుతుంది. వెంటనే డబ్బుని తిరిగి బ్యాగులో వేసుకుని కారులో సన్నీ పారిపోతాడు. ఈ వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. సిసి టీవీ ఫుటేజ్ లాగా ఉండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు సన్నీ నిజంగానే దొంగతనం చేసాడు అని అంటుంటే.. మరికొందరు అది ఫేక్ వీడియో అని కొట్టి పారేస్తున్నాడు. 

సినిమా ప్రమోషన్ కోసం సన్నీ ఇలా ఫ్రాంక్ వీడియోతో బోల్తా కొట్టించాడు అని అంటున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్నీ, సప్తగిరి హీరోలుగా అన్ స్టాపబుల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రచారం కోసం ఇలా సన్నీ ఫ్రాంక్ వీడియోతో తెగించారు అని అంటున్నారు. 

అది నిజమైన దొంగతనమే అయితే సన్నీ ముఖానికి మాస్క్ ఎందుకు వేసుకోలేదు.. పైగా కెమెరాలో అతడి ముఖం క్లియర్ గా కనిపిస్తోంది. ఇలా ఈ ఫుటేజ్ పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ మధ్యన ఇలాగే సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ నది రోడ్డులో ఫ్రాంక్ వీడియో చేసి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న ఈ వీడియోపై సన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios