Asianet News TeluguAsianet News Telugu

హౌస్ లో నీ పరిస్థితి అంతే రవి.. నిన్ను నువ్వే కాల్చుకోవాలి, హైపర్ ఆది పంచులే పంచులు

వేదికపైకి మరో గెస్ట్ గా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరిపై ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ అధికారి గెటప్ లో ఆది వచ్చాడు. 20నిమిషాల పాటు ఆది అందరిని నవ్వుల్లో ముంచెత్తాడు.

Bigg Boss 5 Hyper Aadi comedy punches on House mates
Author
Hyderabad, First Published Oct 10, 2021, 8:49 PM IST

వేదికపైకి మరో గెస్ట్ గా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరిపై ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ అధికారి గెటప్ లో ఆది వచ్చాడు. 20నిమిషాల పాటు ఆది అందరిని నవ్వుల్లో ముంచెత్తాడు. చివరకు నాగార్జునని కూడా వదల్లేదు. అందరిపై తన కామెడీ పంచులతో అదరగొట్టాడు. 1989లో మీరు చైన్ లాగారని ఒక మహిళ ఫిర్యాదు చేసింది సర్ అని నాగార్జునతో అంటాడు. 

అవును లాగాను.. కానీ నేను లాగింది సైకిల్ చైన్ అని నాగ్ బదులిస్తాడు. సైకిల్ చైనా అయితే ఓకె అని ఆది అంటాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా ఎంచుకుని హౌస్ లో వారి గూడు పుఠాణి మొత్తం బయట పెడుతాడు ఆది. అది కూడా తన కామెడీ పంచ్ లు పేల్చుతూ. 

గన్ ఎవరి వద్ద పేలుతుందో వారి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆది. ఒక్కొక్కరి నుంచి వస్తుండగా.. రవి తనపై తానే గన్ పేల్చుకుంటారు. దీనిపై ఆది పంచ్ డైలాగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. 'హౌస్ లో నీ పరిస్థితి అంతే రవి.. నిన్ను నువ్వే కాల్చుకోవాలి అని అంటాడు. ఇక జెస్సి పై కూడా ఆది తన పంచ్ పవర్ చూపించాడు. 

పాపం పేరుకే జెస్సి.. అందరూ అతడిని లస్సీ తగినట్లు తాగేస్తున్నారు అంటూ ఆది జెసిపై జోకులు పేల్చాడు. ఇక మానస్ వెంట పింకీ పడుతుండడంపై కూడా ఆది సరదాగా కామెంట్ చేసాడు. హమీద, శ్రీరామ్ ఎఫైర్ గురించి కూడా ఆది పంచ్ డైలాగ్స్ పేల్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios