బిగ్ బాస్ మూడో సీజన్ రెండో వారం పూర్తి చేసుకోబోతుంది. శనివారం నాడు నాగార్జున ఎంట్రీ ఉండడంతో ఫుల్ జోష్ తో ఆట మొదలైంది. నాగార్జున ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఏం జరుగుతుందో మన టీవీ ద్వారా చూపించారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై వరుణ్ సందేశ్ అండ్ బ్యాచ్ సీరియస్ గా డిస్కస్ చేసుకున్నారు. ఇక హౌస్ లో రొమాంటిక్ జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్, వితికాలు బెడ్ పై ముచ్చట్లు పెట్టుకున్నారు. 

చుట్టూ ఎవరూ లేకపోవడంతో వితికా తన భర్తను కౌగిలించుకునే ప్రయత్నం చేసింది. వీళ్ల రొమాన్స్ బయట నుండి చూస్తున్న జాఫర్, శ్రీముఖిలు సెటైర్లు వేసుకున్నారు. ఇక నాగార్జున కంటెస్టెంట్స్‌కి చురకలు పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తమన్నా హౌస్ మేట్స్ పట్ల, అలీతో ప్రవర్తించిన తీరుపై వివరణ అడిగారు. అయితే తమన్నా తనతో గొడవ పడుతున్న సందర్భంలో అలీ చాలా మెచ్యుర్డ్‌గా వ్యవహరించారని.. నాగార్జున కొనియాడారు.

ప్రతివారంలానే ఈ వారం కూడా కంటెస్టెంట్స్ తో సరదా టాస్క్ ఆడించి సీరియస్ మేటర్స్ ని రాబట్టారు నాగార్జున. బ్లాక్ అండ్ గోల్డ్ కిరీటాలు ఇచ్చి.. హౌస్‌లో మీరు హీరోలా భావించే వారికి గోల్డ్ కిరీటం పెట్టి కారణం చెప్పాలని.. విలన్‌లా భావించే వాళ్లకు బ్లాక్ కిరీటం పెట్టి కారణం చెప్పాలని కోరారు. మూడు గోల్డ్ కిరీటాలు బాబా భాస్కర్ కి రాగా.. విలన్ గా ఎక్కువ కిరీటాలు.. తమన్నా, వరుణ్ సందేష్ లకు వచ్చాయి.

ఇక ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్‌లో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు కంటెస్టెంట్స్ మహేష్ విట్టా, హిమజ, రాహుల్‌, శ్రీముఖిలు సేఫ్ అయ్యారు. ఇక ఎనిమిది మందిలో మిగిలిన నలుగురు వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచుతూ ఎలిమినేషన్‌ను రేపటికి వాయిదా వేశారు నాగార్జున.