యశ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2`. సంచలన విజయం సాధించిన `కేజీఎఫ్‌`కిది రెండో భాగం. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్‌ న్యూస్‌ రాబోతుంది. ఈ నెల 21న బిగ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇయర్‌ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. 

ఇందులో `ఫైనల్లీ ఆ రోజు రాబోతుంది. `కేజీఎఫ్‌2` చివరి దశకు చేరుకుంది. ఈ నెల 21 వండర్‌ఫుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నాం. ఇన్ని రోజులు వెయిట్‌ చేసినందుకు ధన్యవాదాలు` అని తెలిపారు. అయితే ఈ సినిమా నుంచి ఏం రాబోతుంది, ఏ విషయాన్ని చెప్పబోతున్నారనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదల తేదీ, టీజర్‌ రిలీజ్‌తోపాటు యష్‌ ఫస్ట్ లుక్‌ వంటి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. యష్‌, సంజయ్‌ దత్‌ వంటి ప్రధాన తారాగణం ఇందులో పాల్గొన్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.