Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్

బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. 
 
big boss reality show trp far away to expectations ksr
Author
Hyderabad, First Published Oct 21, 2020, 5:33 PM IST

ఈ సారి బిగ్ బాస్ సీజన్ నిర్వాహకులకు ఏమీ కలిసొస్తున్న దాఖలాలు కనిపించడం లేవు. కొన్ని పాప్యులర్ సీరియల్స్ కంటే కూడా బిగ్ బాస్ తక్కువ రేటింగ్ తెచ్చుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎంతో ఆర్భాటంగా నంబర్ వన్ రియాలిటీ షో అని చెప్పుకుంటున్నప్పటికీ రియాలిటీలో అది నిజం కాదని తెలిస్తుంది. మా టీవీలో అత్యధిక ఆదరణ కలిగిన సీరియల్ కార్తీక దీపం టీఆర్పీకి ఆమడ దూరంలో బిగ్ బాస్ షో టీఆర్పీ ఉండడం ఆందోళన కల్గిస్తుంది. 

బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. 

బిగ్ బాస్ టీఆర్పీ చూసిన నిర్వాహకులకు ఏమి చేసి షోకి హైప్ తీసుకురావాలో తెలియని పరిస్థితి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అలాగే ఇంటి సభ్యుల ఎలిమినేషన్స్ విషయంలో పారదర్శకత లేదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇది కూడా బిగ్ బాస్ కి మైనస్ గా మారింది. కాగా కొన్ని పాప్యులర్ టీవీ సీరియల్స్ కంటే కూడా బిగ్ బాస్ షో తక్కువ టీఆర్పీ దక్కించుకుంటుంది. కార్తీక దీపం టీఆర్పీ ఎప్పుడూ 18 కంటే పైనే ఉంటుంది. 

కాగా నాగార్జున ఎంట్రీ ఇస్తున్న వీకెండ్స్ లో 11 టీఆర్పీ దక్కించుకుంటున్న బిగ్ బాస్ షో..మిగతా రోజులలో 8 టీఆర్పీ కంటే దాటడం లేదు. దీన్ని బట్టి కార్తీక దీపం దరిదాపుల్లో కూడా బిగ్ బాస్ షోలేదని అర్థం అవుతుంది. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొని ఉంది. ఈ అరా కొరా టీఆర్పీ ఇంత పెద్ద రియాలిటీ షోకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు. మరి వచ్చే ఎపిసోడ్స్ కైనా ఈ షో అత్యధిక ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.. 
 
Follow Us:
Download App:
  • android
  • ios