Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ ఎన్టీఆర్ కు విలన్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్.. క్రేజీ రూమర్ లో నిజం ఎంత..?

ఆడియన్స్ మాత్రమే కాదు..నిజంగా ఫిల్మ్ మేకర్స్ కూడా ఎప్పుడూ ఊహించని కాంబినేషన్లు వెండితెరపై సందడి చేయబోతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. బిగ్ బీ అమితాబ్ నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత.? 
 

Big B Amitabh Bachchan villain character In NTR and Prashanth Neel Combo Movie JMS
Author
First Published Dec 1, 2023, 12:43 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్. వింటానికి విచిత్రంగా.. ఇంకాస్త ఇంట్రెసటింగ్ గా అనిపించిన విషయం ఇది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఇది. బిగ్ బీ అమితాబ్ ను విలన్ గా ఎన్టీఆర్ సినిమాలో తీసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నట్టు తెలస్తోంది.అలా చూసుకుంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కోసం బిగ్ బీని తీసుకోబోతున్నట్టు సమాచారం.  

భర్త నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న నయనతార, లేట్ గా వెల్లడించిన లేడీ సూపర్ స్టార్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజియఫ్ సినిమాలతో సంచలనంగా మారాడు. ఇక  ఇప్పుడు ప్రభాస్ సలార్ తో మరో సంచలనం సృష్టిచేందుకు సిద్ధమవుతున్నాడు ప్రశాంత్.  రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ రిలీజ్ దగ్గర పడుతుండగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు టీమ్. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ నీల్.. ఈ విధంగా స్సందించారు. 

అమితాబ్ బచ్చన్ గురించి  ఆయన మాట్టాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తను మరణించేలోపు అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమా చేయాలనేది తన డ్రీం అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. అయితే అమితాబ్ ని హీరోగా కాకుండా విలన్ గ చూపిస్తారట. తన సినిమాలో పెద్ద విలన్ గా అమితాబ్ ని చూపించాలనేది ప్రశాంత్ నీల్ కోరిక అని తెలియజేశారు. అయితే ఈ కోరికని ప్రశాంత్ నీల్ ఎప్పుడు నెరవేర్చుకోబోతున్నారు అనేది తెలియజేయలేదు. ప్రశాంత్ తన తరువాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది దర్శకుడి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

#Trisha: బుద్దిలేదా నాపైన పడి ఏడుస్తున్నారు... ఇదేమైనా జాతీయ సమస్య అంటూ.. మండిపడిన త్రిష, కారణం ఎంటీ..?

దీంతో అమితాబ్ ని ఈ సినిమాలో ఎన్టీఆర్ కు  విలన్ గా అమితాబ్ ను చూపించబోతున్నాడు అని అంటున్నారు. అభిమానులు కూడా అదే సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ కూడా బాలీవుడ్ లో సినిమాలు తగ్గించి.. సౌత్ లో వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్నారు.  టాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ లో బిగ్ బీ భాగం అవుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే NTR31లో  ఆయన నటించే అవకాశం ఎక్కువ ఉంది. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తి అయ్యేసరికి చాలా టైమ్ పడుతుంది. అటు ప్రశాంత్ నీల్ కూడా సలార్ రిలీజ్ బిజీలో ఉన్నాడు. దాంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్స్ కామ్ అయిపోవడం ఖాయం అంటున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios