ఇటీవల సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్.  ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కూడా బెల్లంకొండకి నిరాశే మిగిల్చింది.  సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు రాబట్టడంలో ఫెయిల్ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ హీరో.. కాజల్ తో జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో కొన్ని షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే.. షూటింగ్ అయిపోవడం వల్ల తాను ఓ వ్యక్తిని బాగా మిస్ అవుతున్నానని బెల్లకొండ శ్రీనివాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

 

థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ విలన్‌కు సంబంధించిన యాక్షన్‌ పార్ట్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసేసింది చిత్ర యూనిట్‌. అయితే ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ.. తనతో వర్క్‌ చేయడం చాలా సరదాగా ఉందంటూ ట్వీట్‌ చేశాడు మన హీరో. 

ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వంశధార క్రియేషన్స్‌పై నవీన్‌ శొంటినేని నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.