బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `సీత`. కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అంటూ లేని బెల్లంకొండ బెల్ల‌కొండ ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే పెట్టుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో ప్రక్క  దర్శకుడు తేజ కూడా `నేనే రాజు నేను మంత్రి` అనే హిట్ సినిమా ఇచ్చినా ఏ పెద్ద హీరో పిలిచి సినిమా ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకోవటం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఇది.  

వాస్తవానికి ఇప్ప‌టికే విడుదల‌వ్వాల్సిన సినిమా… కానీ రకరకాల కార‌ణాలతో  వ‌ల్ల డిలే అవుతోంది. చివరకు ఈనెల 25న అయినా రిలీజ్ చేయాల‌ని డిసైడ్ చేసుకున్నారు. అయితే  అందుతున్న సమాచారం మేరకు అదీ కష్టమే అని తెలుస్తోంది.  రిలీజ్ డేట్ ప్రకటించినా బజ్ క్రియేట్ కాలేదని, బిజినెస్ కాలేదని చెప్తున్నారు. అలాగే ‘సీత’కు బిజినెస్ పూర్తి అయిపోయిందని.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడైపోయంటూ వచ్చిన ప్రకటనలు అబద్దమే అని చెప్తున్నారు. 

ఇదిలా ఉంటే...  ఈ వారం ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా భారీ అంచనాలతోరిలీజ్ కు సిద్ధమవుతోంది.‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’తో  పోటీ పడితే మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టడం కష్టమే .అలాగే  మార్కెట్లో ఆల్రెడీ ఉన్న  `మ‌జిలీ`, చిత్ర‌లహ‌రి, `జెర్సీ` హిట్ టాక్ తో దూసుకుపోవటం సీతకు దెబ్బందంటున్నారు. 

మరో ప్రక్క టాక్ బాగోలేకపోయినా `కాంచ‌న -3`కి ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు బాగానే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇవ‌న్నీ `సీత‌` రిలీజ్ కు ఇబ్బందిగా మారాయి.  మంచి కలెక్షన్స్ తెస్తున్న సినిమాలు ర‌న్నింగ్ లో ఉన్న నేప‌థ్యంలో వాటిని తీసేసి ,  సీత‌కు థియేట‌ర్లు ఇవ్వ‌డానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావ‌డం లేద‌ని  ట్రేడ్ సమాచారం.దాంతో వేరే దారి లేక  `సీత‌`ని మే 17 కు వాయిదా వేసే ఆలోచ‌న‌లో యూనిట్ ఉన్న‌ట్లు స‌మాచారం