Asianet News TeluguAsianet News Telugu

'టైసన్ నాయుడు' ఫస్ట్ గ్లింప్స్ పగిలిపోయిందిగా..ఎట్టకేలకు బెల్లంకొండకి సరైన డైరెక్టర్ తగిలాడు

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్టు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ తన 100 శాతం డెడికేషన్ చూపిస్తాడు. కానీ బెల్లంకొండ హీరోకి విజయం దక్కడం లేదు. 

Bellakonda Srinivas Tyson Naidu First Glimpse out now dtr
Author
First Published Jan 3, 2024, 5:35 PM IST

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్టు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ తన 100 శాతం డెడికేషన్ చూపిస్తాడు. కానీ బెల్లంకొండ హీరోకి విజయం దక్కడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు చాలా మంది దర్శకులతో వర్క్ చేశాడు. కానీ ఎవరూ హిట్ ఇవ్వలేకపోయారు. పర్వాలేదనిపించింది చిత్రాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. 

బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా హిందీలో రీమేక్ చేసిన ఛత్రపతి చిత్రం కూడా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. నేడు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 

ఈ చిత్రానికి టైసన్ నాయుడు అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ గ్లింప్స్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. భీమ్లా నాయక్ తర్వాత సాగర్ చంద్ర అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని గ్లింప్స్ తో అర్థం అవుతోంది. గ్లింప్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ని సాగర్ చంద్ర పవర్ ఫుల్ గా చూపిస్తూ అదరగొట్టేశారు. 

గ్లింప్స్ చూస్తుంటే పోలీస్ఎం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ చేస్తున్న యాక్షన్ స్టంట్స్, పవర్ ఫుల్ లుక్స్ మెప్పించే విధంగా ఉన్నాయి. ఎట్టకేలకు బెల్లంకొండ బాబుకి సరైన డైరెక్టర్ తగిలాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios