Asianet News TeluguAsianet News Telugu

Bangarraju:'బంగార్రాజు' ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

‘మనం’ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెర పంచుకోనుండటం బిజినెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం.
 

Bangarraju Worldwide Pre-release business
Author
Hyderabad, First Published Jan 9, 2022, 4:12 PM IST

కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ సక్సెస్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సినిమాలో 'బంగార్రాజు' రొమాంటిక్ డోస్ పీక్స్‌లో ఉండనున్నాడు. ‘మనం’ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెర పంచుకోనుండటం బిజినెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ థియోటర్ రైట్స్ 39 కోట్లు వరకూ అమ్ముడయ్యాయి. నాగార్జున, నాగచైతన్య కు ఉన్న మార్కెట్లు పరిగణనలోకి తీసుకుని అమ్మకాలు జరిగాయి.

నైజాం  11 కోట్లు 
సీడెడ్  6 కోట్లు 
ఉత్తరాంధ్ర  4.14 కోట్లు
గుంటూరు  3.24 కోట్లు 
ఈస్ట్ గోదావరి  2.88 కోట్లు 
వెస్ట్ గోదావరి  2.60 కోట్లు
కృష్ణా  2.70 కోట్లు 
నెల్లూరు 1.50 కోట్లు

మొత్తం  34 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాలు  2.50 కోట్లు
ఓవర్ సీస్ 2.50 కోట్లు 

టోటల్ గా ప్రంపంచవ్యాప్తంగా  39 కోట్లు
 
నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి ఆడిపాడింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, అన్ని అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపించబోతున్నారట. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలతో పాటు మరో ఆరుగురు అందాల భామలు కనిపించనున్నారని చెప్పారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ కలరింగ్ ఈ బంగార్రాజు సినిమాలో చూడనున్నాం. 
  
 ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికు రాకుండా ప్రక్కకు వెళ్లిన నేపధ్యంలో ఆ ప్లేస్ లో వస్తున్న పెద్ద సినిమాగా ఈ సినిమా క్రేజ్ తెచ్చుకుంటోంది. అయితే ఆ క్రేజ్ ఏ స్దాయి కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది. కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేైపధ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడనుంది అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ లలో కూడా ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాల్సి వస్తుంది. అందులోనూ 'బంగార్రాజు' సినిమా కోసం ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాల్సి ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో రిస్క్ తీసుకొని సినిమాలు చూడటానికి వస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే నాగార్జున సినిమాకు కూడా సమస్యలు తప్పవనే కామెంట్స్ వస్తున్నాయి.  

 గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.   ''బంగార్రాజు''  నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.

Follow Us:
Download App:
  • android
  • ios