Asianet News TeluguAsianet News Telugu

బంగార్రాజు.. ఇంకా చెక్కలేదు!

రీసెంట్ గా నాగ్ బంగార్రాజు ప్రాజెక్ట్ పై ఒక చిన్న వివరణ ఇచ్చారు. ఆ సీక్వెల్ ని చేయడానికి సిద్ధంగా ఉన్న మాట వాస్తవమే కానీ కథ నచ్చితేనే సినిమాను స్టార్ట్ చేస్తానని నాగ్ తెలిపారు. 

bangarraju latest update
Author
Hyderabad, First Published Apr 3, 2019, 4:01 PM IST

నవమన్మథుడు అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందించిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన. నాగ్ కి 50 కోట్ల మార్కెట్ ను సెట్ చేసిన ఆ కథకు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసిన సంగతి సంగతి తెలిసిందే  అయితే సినిమా అఫీషియల్ గా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. 

ఇక రీసెంట్ గా నాగ్ బంగార్రాజు ప్రాజెక్ట్ పై ఒక చిన్న వివరణ ఇచ్చారు. ఆ సీక్వెల్ ని చేయడానికి సిద్ధంగా ఉన్న మాట వాస్తవమే కానీ కథ నచ్చితేనే సినిమాను స్టార్ట్ చేస్తానని నాగ్ తెలిపారు. అంటే ఇంకా కథను చెక్కుతూనే.. ఉన్నారట. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథను ఇంకా నాగ్ అంచనాలకు తగ్గట్టుగా సెట్ చేయలేదట. 

బాండ్ స్క్రిప్ట్ తో వస్తేనే స్టార్ట్ చేద్దామని మన్మధుడు వివరణ ఇవ్వడంతో దర్శకుడు రైటర్స్ ని కలిసి కథపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా సగం షెడ్యూల్ అయిన తరువాతే బంగార్రాజు సినిమాను మొదలెట్టాలని నాగ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios