తెలంగాణ ఎలక్షన్స్ ఈ సారి ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తిని  రేపాయి. టీఆరెస్ పార్టీ నేతలు ఓ లెవెల్ వరకు నీట్ గా వెళితే.. ప్రజకూటమి మాత్రం బేస్ వాయిస్ తో ఊహించని విమర్శలతో ముందుకు సాగింది. అయితే మొత్తానికి కూటమి ఒక్కసారిగా కుప్పకూలింది. 

ఇక ప్రజకూటమి అధికారంలోకి రానున్నట్లు డైలాగ్స్ కొట్టిన నేతలు ఇప్పుడు ఎక్కడా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కి ముందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లెడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పిన బండ్లన్న ఇప్పుడు ఎక్కడా అంటూ అనేక రకాల మేమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే ఫైనల్ గా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు. అంటూ బండ్ల గణేష్ సైలెంట్ గా వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెటిజన్స్ మరింతగా బండ్లగణేష్ ట్వీట్ ను వైరల్ అయ్యేలా చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి మీడియా ముందుకు వస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.