సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న యాక్షన్ మూవీ ఎన్బీకే107. ఈ మూవీ న్యూ షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. టైటిల్ అనౌన్స్ పైనా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. 

`అఖండ` లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలయ్య నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ‘ఎన్బీకే107’(NBK107) . ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న బాలయ్య- గోపీచంద్ కాంబినేషనల్ వస్తున్న చిత్రం ఎన్బీకే107పై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా మాస్ లుక్ లో చూపించేందుకు గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న విషయం తెలుస్తోంది. 

ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరిగింది. ఇటీవల బాలయ్యకు కరోనా రావడంతో కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో మళ్లీ షూటింగ్ ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 9 నుంచే మొదలు కావాల్సిన షూటింగ్ ను.. జూలై 24 నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ను కర్నూల్ లో స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లో మరిన్ని కీలక సన్నివేశాలను, యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. 

అలాగే బాలయ్య ‘ఎన్బీకే107’ టైటిల్ పైనా ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బాలయ్య సినిమాలంటే అభిమానులు ఎక్కువ ఇంప్రెస్ అయ్యేది టైటిల్ కే. చాలా రోజులుగా టైటిల్ ను అనౌన్స్ చేయకుండా జరుపుతున్న మేకర్స్ అతి త్వరలోనే ప్రకటించననున్నట్టు తెలుస్తోంది. ఈసారి వచ్చే అప్డేట్ టైటిల్ గురించే ఉంటుందని సమాచారం. గతం నుంచే ఈ మూవీకి ‘జై బాలయ్య’, ‘అన్నగారు’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండింటిలో ‘జై బాలయ్య’నే ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. 

ఈ చిత్రంలో బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ (Shruti Haasan) బాలయ్య సరసన ఆడిపాడనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు మూవీని నిర్మిస్తున్నారు. మూవీలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రతో నటిస్తుండటం సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాస్ బీట్ ను అందించే పనిలో ఉన్నారు.