Asianet News TeluguAsianet News Telugu

#Unstoppable2: ఓ వారం గెస్ట్ గా ఆయనా?, అల్లు అరవింద్ షాక్

మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన చాలామంది బిగ్ సెలబ్రిటీలు రావడం బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేయడంతో పాటు మరోపక్క కామెడీ పండించటం.. చాలావరకు రక్తి కట్టించింది. 

Balakrishna Unstoppable With NBK Season 2 Guest
Author
First Published Sep 28, 2022, 4:27 PM IST


 ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే’  ‘ఆహా’ ఓటీటీ  లో స్ట్రీమింగ్ అయ్యి  ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ స్టార్ట్ చేస్తున్నారు.“అన్ స్టాపబుల్ ” షో ఇండియాలో ఓటీటి రంగంలో అనేక రికార్డులు సృష్టించింది. ఫస్ట్ టైం బాలయ్య హోస్ట్ గా అద్భుతంగా షో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన చాలామంది బిగ్ సెలబ్రిటీలు రావడం బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేయడంతో పాటు మరోపక్క కామెడీ పండించటం.. చాలావరకు రక్తి కట్టించింది. ముఖ్యంగా మహేష్ బాబు, రవితేజ, పూరి అదే విధంగా విజయ్ దేవరకొండ వచ్చిన ఎపిసోడ్ లు బాగా హైలైట్ అయ్యాయి.

 ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఎన్‌బీకే107 సినిమా షూటింగ్ చేస్తున్న బాలకృష్ణ, తిరిగొచ్చిన వెంటనే… ‘అన్‌స్టాప‌బుల్‌ 2’ (Unstoppable 2) స్టార్ట్ చేయనున్నారు.  ఈ క్రమంలో ఈ షోకు రెట్టింపు క్రేజ్ తేవటం కోసం … గెస్ట్ ల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని గెస్ట్ ని ఈ షోకు పిలుస్తున్నారని సమాచారం. 

ఆ గెస్ట్ మరెవరో కాదు బాలకృష్ణ కు స్వయానా బావ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తో మాట్లాడారని , దాదాపు ఓకే అయ్యినట్లు చెప్తున్నారు. ఈ ఆలోచనకు అల్లు అరవింద్ సైతం షాక్ అయ్యినట్లు చెప్తున్నారు. ఈ సీజన్ కు ఇది పెద్ద బ్లాస్టర్ అవుతుందని, సరిగ్గా ప్లాన్ చెయ్యమని చెప్పారట. ఈ ఎపిసోడ్ క్లిక్ అయితే మరింత మంది రాజకీయనాయకులను సైతం ఇక్కడికి అహ్వానించే అవకాసం ఉంది. మొత్తానికి ఆహా అనిపించాలనే తపనతో టీమ్ అదిరిపోయే ఐడియాలు ప్లాన్ చేస్తోంది. 

ఇక బాలయ్య, చంద్రబాబుల మధ్య ఏం టాపిక్ లు వస్తాయి. చంద్రబాబు కూడా సరదాగా ఈ ఎపిసోడ్ లో ఫన్ తో అదరకొడతాడా అనేది  హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ ఓ రేంజిలో పేలే అవకాసం ఉందని టీమ్ అంచనా వేస్తోందిట. చంద్రబాబు కూడా జనాల్లో నానటం, ముఖ్యంగా కుర్రాళ్లలో నానటం అవసరం అని భావిస్తున్నారు. యూత్ లోకి పార్టీని తీసుకెళ్లాలంటే ఇలాంటివి కొన్ని ప్లాన్ చెయ్యాలనుకుంటున్నారు. 

దసరా నుండి ప్రారంభం కాబోయే “అన్ స్టాపబుల్ 2″లో మొదటిగా చిరంజీవి రానున్నారట. ఆ టైంలోనే “గాడ్ ఫాదర్” రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్ మాదిరిగా ఈ షోలోకి చిరంజీవి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొదటి సీజన్ లోనే చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది కానీ చివరిలో క్యాన్సిల్ అయినట్లు టాక్. కానీ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ చిరంజీవితోనే స్టార్ట్ కానుందట.

మరో ప్రక్క నిన్న  ‘అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్’ విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2’ టైటిల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీ అందించారు. యువ గాయకుడు, ర్యాపర్ రోల్ రైడ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios