Asianet News TeluguAsianet News Telugu

BalaKrishna : పూరీని సర్ ప్రైజ్ చేసిన బాలయ్య... షాక్ లో విజయ్ దేవరకొండ

నందబాలక్రిష్ణ ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను తెగ సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అఖండతో సక్సెస్ ఫ్లైట్ ను నడిపిస్తున్న బాలయ్య, ‘ఆహా’లో కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవరిస్తూ మరోసారి సర్ప్రైజ్ చేశారు.  తాజాగా ఈ షోకు విచ్చేసిన పూరీ జగన్నాథ్ ను కూడా సర్ ప్రైజ్ చేశారు బాలయ్య. బాలయ్య సర్ ప్రైజ్ కి విజయ్ దేవర కొండ కూడా షాక్ తిన్నారు. 
 

BalaKrishna Surprises Puri, Vijay Got Shocked, Social Media Post.
Author
Hyderabad, First Published Jan 17, 2022, 7:11 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రోడక్షన్ సంస్థలు నిర్మిస్తున్న మూవీ లైగర్.  ఈ మూవీ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్నారు. విజయ్ కి జంటగా అనన్య పాండే నటిస్తున్నారు.  వీరితోపాటు ఈ మూవీలో రోనిత్ రాయ్, రమ్య క్రిష్ణ కూడా నటిస్తున్నారు. కాగా ఈ ఫిల్మ్ కి సంబంధించిన గ్లిమ్స్ ను ఇటీవల వదలగా మంచి రెస్పాండ్ వచ్చింది. లైగర్ మూవీని ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నారు.  

కాగా, అన్ స్టాపబుల్ షోలో బాలయ్య జోష్ అన్ స్టాపబుల్  గా ఉంది. అదే జోష్ లో టాలీవుడ్ లో ట్రెండ్ లో ఉన్న హీరోలు, డైరెక్టర్లను తన షోకు పిలిచి వారిని ఖుషీ చేస్తున్నారు. బాలయ్య హోస్టింగ్ చూసిన అభిమానులు కూడా కిర్రాక్ అంటున్నారు. అయితే ఇటీవల ‘అన్ స్టాపబుల్ ఎపిసోడ్ -9’కు  ‘లైగర్’టీంను ఆహ్వానించారు. టీం నుంచి డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, చార్మీ వచ్చారు. 

 

నందబాలక్రిష్ణ ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను తెగ సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అఖండతో సక్సెస్ ఫ్లైట్ ను నడిపిస్తున్న బాలయ్య, ‘ఆహా’లో కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవరిస్తూ మరోసారి సర్ప్రైజ్ చేశారు. తాజాగా ఈ షోకు విచ్చేసిన పూరీ జగన్నాథ్ ను కూడా సర్ ప్రైజ్ చేశారు బాలయ్య. బాలయ్య సర్ ప్రైజ్ కి విజయ్ దేవర కొండ కూడా షాక్ తిన్నారు.

అయితే ఈ సీజన్ కు సంబంధించిన క్లిప్ ను య్యూటూబ్ లో ‘ఆహా వీడియో ఇండియా’లో తాజాగా విడుదల చేశారు. ఈ వీడియాలో గెస్ట్ గా వచ్చిన  పూరీకి హీరో విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియోను చూపించి ఈ బాలుడిని నీ సినిమాలో పెట్టాలంటాడు. దీనికి పూరీ ‘మీరు చెప్పాక్కూడ పెట్టకోపోవడం ఉంటుందా’ అంటూ స్వీట్ గా బదులిస్తాడు. 

అయితే ఈ వీడియోపై విజయ్ స్పందిస్తూ తను చిన్నప్పుడు పుట్టపర్తి  ఆశ్రమంలో చదువుకునేప్పుడు తమలో కొంచెం బొద్దుగా వారిని పలు కార్యక్రమాలకు తీసుకెళ్లే వారని, అలాగే తాను లావుగా ఉండటంతో తనను తీసుకెళ్లి అక్కడ ఒక డైలాగ్ చెప్పించారని వివరణ ఇచ్చాడు.  అయితే తన చిన్నప్పటి ఫొటో ను చూసి తానే షాక్ కు గురయ్యాడు విజయ్ దేవరకొండ. పక్కనే చార్మీ నవ్వుతూ విజయ్ చేయ్యిని నిమిరింది. 

ప్రస్తుతం ఈ వీడియో య్యూటూబ్ లో దూసుకుపోతోంది. అప్ లోడ్ చేసిన గంటలోపే లక్ష వ్యూస్ వచ్చాయి. రెండు గంటల్లో లక్షన్నర వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ఏదేమైనా బాలయ్య ఇచ్చే సర్ ప్రైజ్ తో  ప్రతి ఒక్కరూ ఖుషీ అవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios